Followers

Search This Blog

Theme images by MichaelJay. Powered by Blogger.

About Simpro

Find Us On Facebook

About Me

My photo
hi, Iam Ravindra nath Tagore. I have to create this blog to write articles on some great persons and social elements to motivate all. This is very useful to you.

Gallery

About the Author

Featured post

గాంధీజీ ఆత్మహత్యాప్రయత్నం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 03

                  జీవితంలో మంచి వ్యక్తుల స్నేహం మంచి జీవితాన్ని ప్రసాదిస్తే, చెడు స్నేహం మాత్రం జీవితపు లోతులను తెలుసుకోగలిగేలా చేస్...

Contact Form

Name

Email *

Message *

Popular Posts

ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి -- మేడం క్యూరీ

    32

                               

                    1891 లో ఓ 24   ఏళ్ళ యువతి తాను కన్న కలలను సాధించటం కోసం, తన చుట్టూ ఉన్న సమాజానికి  ఏదో చేయాలనే  కసి తో  పోలాండ్ నుండి పారిస్ కు వచ్చింది. అప్పటికే తన తల్లి చనిపోయింది.  డబ్బులు పెట్టి మంచి గది తీసుకోలేక , ఎముకలు కొరికే ఆ  చలిలో ఒక చిన్న పూరి పాకలో ఉంటూ చదువుకొనేది. తినడానికి డబ్బులు లేక రొట్టెను నీళ్లలో ముంచుకు తినేది. అంతటి దారుణమైన పరిస్థితులలో కూడా ఆమె తన లక్ష్యాన్ని మరువలేదు. ట్యూషన్లు చెబుతూ , ఆ వచ్చిన డబ్బులతో బతికి, ఏకంగా  యూనివర్సిటీ ఫస్ట్  వచ్చింది. తాను ఉన్న పూరి పాకనే ప్రయోగశాలగా మార్చుకుని, కాన్సర్ మహమ్మారి ని అంతం చేయాలనే సంకల్పంతో ప్రయోగాలు మొదలు పెట్టింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు మాత్రం వేయలేదు. చివరికి ఆమె సాధించింది . అవును ఆమె నోబెల్ ప్రైజ్ సాధించింది, ఒకటి కాదు ,  రెండు నోబెల్ బహుమతులను సాధించింది. పరోక్షంగా ఆరు నోబెల్  బహుమతులకు  ఆమె కారణం అయ్యింది. ఆనాటి పురుషాధిక్యత సమాజం లో ఒక మహిళ ఇంత గొప్ప విజయం  సాధించటమా,  ఇంతకీ ఎవరు ఆమె, ఆవిడే మేడం క్యూరీ . 

                          మీకు తెలియని భయంకరమైన , ఆశ్చర్యకరమైన వింత మరణాలు
       

        
                    పోలాండ్ దేశానికీ చెందిన మేరీ క్యూరీ 1867 లో పుట్టింది. ,  చిన్నప్పుడే తన తల్లి , చనిపోవటం తో కుటుంబ భారమంతా తండ్రి పైనే పడింది. ఆ బాధ్యత తోనే మేరీ క్యూరీ ఎంతో శ్రద్దగా చదువుకునేది. తండ్రి లాగే ట్యూషన్లు చెబుతూ, తన మిగతా ముగ్గురు అక్కలకు అండగా నిలిచింది. అప్పుడు ఆమె వయసులో చిన్నది కావచ్చు, కానీ  తన కుటుంబానికి ఆమె అండగా నిలిచింది .తన  తండ్రి కోరిక మేరకు, తాను కన్నకలలను నిజం చేసుకోవటానికి ఆమె  పారిస్ పయనం అయ్యింది. 

➤  పూరి పాకే తన ప్రయోగశాల :

                         అంతటి పారిస్ మహా నగరంలో , చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, ఆమె ఏ మాత్రం బెదరలేదు. తన లక్ష్యాన్ని ఏ మాత్రం దూరం చేసుకోలేదు. తినటానికి తిండి లేని ఎన్నో రోజుల్లో కూడా ఆమెలో ఆత్మవిశ్వాసం మచ్చుకైనా తగ్గలేదు. డబ్బులు పెట్టి మంచి గది తీసుకోలేక , ఎముకలు కొరికే ఆ  చలిలో ఒక చిన్న పూరి పాకలో ఉంటూ చదువుకొనేది. తినడానికి డబ్బులు లేక రొట్టెను నీళ్లలో ముంచుకు తినేది. అంతటి దారుణమైన పరిస్థితులలో కూడా ఆమె తన లక్ష్యాన్ని మరువలేదు. ట్యూషన్లు చెబుతూ , ఆ వచ్చిన డబ్బులతో బతికి, ఏకంగా ఇంగ్లీష్ లో   యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. ఆ తరువాత తండ్రి  సూచన మేరకు ఫిజిక్స్ ఫై తన దృష్టి ని నిలిపింది. 

     
                     తాను ఉంటున్న పూరి పాకనే ప్రయోగశాలగా మార్చుకుంది.అలా చదువు కొనసాగిస్తుండగా ప్రేమ ప్రయత్నంలో మోసపోయి ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయింది. తరువాత తాను నిలదొక్కుకుని నిబ్బరంగా ఆలోచించి..‘‘ఒక చిన్న దెబ్బ తగిలితే ఆత్మహత్యా? నా కోసం తపిస్తున్న నా తండ్రి నా తోడబుట్టిన వాళ్ళు... వారిపట్ల నాబాధ్యత ఇదేనా’’ అని ఆత్మవిమర్శ చేసుకుంటూ ‘‘...కాదు, కాదు... ఎక్కడ కింద పడ్డానో అక్కడే పైకి లేవాలి. నాకు జరిగిన మోసాన్ని ఒక పీడకలగా మర్చిపోవాలి’ అని దృఢంగా నిశ్చయించుకుంది. 
    
     
                                  తన శక్తిని మొత్తాన్నీ ఫిజిక్స్‌ మీద పెట్టింది. మళ్ళీ వివాహం చేసుకుని గర్భిణీ అయి ఉండి కూడా, భర్తతో కలిసి ప్రయోగాలు చేస్తూ , క్యాన్సర్‌కు చికిత్స చేయతగిన మూలకాన్ని కనిపెట్టి యురేనియం అని ధ్వనించేటట్లుగా తన మాతృదేశంపేరుని జోడించి ‘పొలేరియం’ అని పేరుపెట్టి తన దేశభక్తి చాటుకుంది. ఆమెచేసిన కృషికి గుర్తింపు లభించి ‘నోబెల్‌ బహుమతి’ లభించింది. ఆమెతో కలిసి పనిచేసినందుకు ఆమె భర్తకు, ఆమె గురువుకు మరో రెండు నోబెల్‌ బహుమతులొచ్చాయి. దానితో బాగా ఐశ్వర్యం కూడా వచ్చింది.  ఆ సంతోషం ఎక్కువకాలం నిలవకుండానే తండ్రి చనిపోయాడు... మరికొద్ది రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో భర్త కూడా చనిపోయాడు. అప్పటికి ఆమె వయసు 40 దాటలేదు. క్యాన్సర్‌కు ఔషధం కనిపెట్టడానికి రోజుకు 18 గంటలు కష్టపడి ఆరోగ్యాన్ని ఎంతగా త్యాగం చేసేసిందంటే.. ఆమెకే  బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చింది.అయినా ఆమె వెరవలేదు. ఆ పరుగు,  ఆ పట్టుదల, ఆ కసి ఆగలేదు...ఈ సారి కెమిస్ట్రీలో మరొక ‘నోబెల్‌’ బహుమతి తెచ్చుకుంది. ఆమె దార్శనికత వలన ఆమె కూతురికి, అల్లుడికి కూడా మరో రెండు నోబెల్‌ బహుమతులొచ్చాయి. అంటే ఆమె ఒక్కతే ఆరు నోబెల్‌ బహుమతులకు కారణమయింది. 

                         ఆమె  తన పరిశోధనలకు పేటెంట్‌ తీసుకుని ఉంటే తదనంతరకాలంలో ఆమె వంశీకులకు బిల్‌గేట్స్‌ కన్నా వెయ్యి రెట్ల ఐశ్వర్యం వచ్చి ఉండేది. కానీ ‘‘అది భూమిలోంచి వచ్చింది, ప్రకృతి ఇచ్చింది. అది ప్రజలకు అందాలి. ఆ పేటెంట్‌ తీసుకోవడానికి నేనెవర్ని. నాకు అక్కరలేదు.’’ అని చెప్పేసింది. చివరగా తను కోరుకున్నదేమిటంటే తన సమాధిలో పిడికెడు మట్టి...అదీ తన జన్మభూమినుంచి తెచ్చి చల్లాలని కోరుకుంది.  




గుర్తుపెట్టుకోండి. 

       చిన్నప్పటినుండి ఆమెను కష్టాలు నీడలా  వెంటాడాయి. అడుగడుగునా విధి  ఆమెతో ఆడుకుంది. తనకంటూ ఎవ్వరినీ లేకుండా చేసింది. కానీ ఆమె ఆ విధినే ఎదిరించి తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆనాటి  పురుషాధిక్యత సమాజంలో ఉదయించి, ఎన్నటికీ తరగని, చెరగని కీర్తి ని సంపాదించి,  కొన్ని కోట్ల మంది గుండెల్లో ఆమె ధ్రువ తార గా నిలిచిపోయింది .   ఎవరి జీవితాలూ వడ్డించిన విస్తళ్ళు కావు. గులాబీ పువ్వు కింద ముళ్ళు చూసి భయపడిన వారు  జీవితంలో అక్కడే ఉంటారు. ఆ పువ్వు సౌందర్యాన్ని, సౌరభాన్ని చూడాలనుకున్నవారు  ముందుకే అడుగేస్తారు .   
                                                                                                                            choice is your's.



మూలం : సాక్షి దినపత్రిక 
    

32 comments:
Write comments
  1. It is really inspired me. Even through she faced many problems and loses her family , she didn't give up to her dream. Every one need this .
    Thanks for sharing this wonderful information .Keep writing on.

    ReplyDelete
  2. This story is inspirational to everyone. You had done a great job. Thank you.

    ReplyDelete
  3. very inspirational story..thank u

    ReplyDelete
  4. very nice guna ...i am really inspired ..thank u so much

    ReplyDelete
  5. Good job Ravi
    What an excellent inspiring story
    Keep writing on

    ReplyDelete
  6. it is really inspirational keep it up

    ReplyDelete
  7. This story is very inspired me and very nice story.keep it up.

    ReplyDelete
  8. super story, very inspirational .

    ReplyDelete
  9. Very inspiring story. Keep writing on sir.

    ReplyDelete
  10. Nice story bro.
    Keep rocking😀😀

    ReplyDelete
  11. Inspiring story..... Thankyou for sharing this story to me........

    ReplyDelete
  12. inspirational story of Rguktains.........

    ReplyDelete

thank you for your great words

Services

More Services

© 2014 The Tagore Times. Designed by Bloggertheme9 | Distributed By Gooyaabi Templates
Powered by Blogger.