" నా చుట్టూ ఉన్న సమాజంలో నేను చాలా ప్రత్యేకం, నా వ్యక్తిత్వం కానీ , నాకున్న లక్ష్యాలు కానీ , లక్షణాలు కానీ అందరి కన్నా చాలా విభిన్నం, నా ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి , వాటిని ఎవరు అందుకోలేరు" , అని ఎవరికి వారు రకరకాలుగా వారి గురుంచి, తమ జీవితం గురుంచి చాలా సార్లు చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఒక్కసారి నిజ జీవితంలో వచ్చి వాస్తవాలను విభిన్న దృష్టి తో పరిశీలిస్తే మనం ఎవ్వరం ప్రత్యేకం కాదని తెలుస్తుంది. నలుగురు నడిచే దారిలోనే మనం కూడా నడుస్తున్నాం అని అర్థమవుతుంది. ఈ అనంత భారతంలో ఉన్న ఎన్నో కోట్ల మంది నిరుద్యోగుల లాగానే మనం కూడా చివరికి ఉద్యోగాల వేటలో పడి మన ఆలోచనలను మనతోనే అంతం చేసుకుంటున్నాం. మన ఆలోచనలను , మన మెదడులో ఉన్న జ్ఞానాన్ని , ఒక ఉద్యోగిగా , మనం ఇంకెవడో జీవితం లో ఎదగటానికి ఉపయోగిస్తాం, కానీ వాటిని మన కోసం ఉపయోగించం , ఎందుకంటె మనం సామాన్యులం కాబట్టి , మన వల్ల కాదు అని మనం మన బుర్రలో గట్టిగా నిర్ణయించుకున్నాం కాబట్టి. ఉద్యోగాన్ని అర్థించే ఉద్యోగార్థి గా నే మనం ఆలోచిస్తాం తప్ప, వ్యాపారవేత్తలుగా ఎదిగి, నిరుద్యోగ భారతాన్ని అంతం చేయాలనే ఆలోచన మనలో చాలా తక్కువ మందికే ఉంటుంది.
అసలు ఎందుకు మనం వ్యాపారవేత్తలుగా ఎదగాలి, ఎదిగి ఏం సాధించాలి...?
➤ ఓ ముప్పై ఏళ్ళ యువకుడు తనకున్న ఒక కొత్త ఐడియా తో కొత్తగా వ్యాపారం చేద్దామని, తాను పనిచేస్తున్న కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హోదాను వదులుకుని, బయటకు వచ్చేసాడు. తన చుట్టూ ఉన్న సమాజం తనను చూసి నవ్వింది. తెలిసిన వాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వటం మొదలు పెట్టారు. అయినా ఒక్క అడుగు కూడా వెనుకకు వేయలేదు. చివరికి అతను సాధించాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం నలుమూలలకు విస్తరించాడు. తన ఐడియా ఆరు లక్షల మందికి ఉపాధినిచ్చింది, అంతేకాదు తనను లక్షల కోట్లకు అధిపతిని చేసింది.అతడే జెఫ్ బెజోస్. అతని ఆలోచనే అమెజాన్ .
➤ అతను ఓ నిరుద్యోగి , ఇంకా గట్టిగా చెప్పాలంటే దరిద్రానికి చాల దగ్గరి బంధువు. దాదాపు ముప్పై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్కరు అతని ఫై కనికరం చూపలేదు. అంతేనా విధి కూడా అతనితో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంది. కానీ అతను మాత్రం అదరలేదు, బెదరలేదు. ఒకరిని నేను ఉద్యోగం అడగటం ఏమిటి లక్షల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి అని అనుకున్నాడు . చివరికి తాను అనుకున్నది సాధించాడు, ఏకంగా మహాసముద్రం లాంటి చైనా వ్యాపార సామ్రాజ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కోట్లకు కాదు.. కాదు.. లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. అతనే అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా .
➤ పరిస్థితుల ప్రభావం వల్ల దేశం కానీ దేశం లో పెట్రోల్ బంక్ లో పనిచేయవల్సివచ్చింది. చదివింది కూడా పెద్దగా ఏం లేదు.కానీ మనసులో ఏదో చేయాలన్న తపన మాత్రం ఉంది. తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటానికి తన సొంత దేశానికీ తిరిగి వచ్చేసాడు. నాడు ముంబై లో ఓ చిన్న వీధిలోని ఇరుకు గదిలో ప్రారంభించబడిన రిలయన్స్ అనే కంపెనీ విలువ నేడు అక్షరాలా 8 లక్షల కోట్లు. వినటానికే ఆశర్యంగా ఉన్నా, ఇది నిజం . అంతే కాదు ఆనాడు ఆ వ్యక్తి మదిలో మెదిలిన ఆలోచన నేడు రెండు లక్షల మందికి ఉపాధినిచ్చింది. అతనే ధీరుభాయి అంబానీ.
➤ చెప్పుకోవటానికి వీరొక్కరే కాదు, జుకెర్ బర్గ్, అజీమ్ ప్రేమ్ జీ, కుమార్ మంగళం బిర్లా, లక్ష్మి మిట్టల్, నారాయణ్ మూర్తి, ఆనంద్ మహీంద్రా.. ఇలా ఎందరో ఒక్కప్పుడు మనలాగే అతి సామాన్యులు, కానీ వారి ఆలోచనలు వారిని సామాన్యులుగా ఉండనివ్వలేదు. ఆ ఆలోచనలే వారిని గొప్ప వారిని చేసాయి. ఆ ఆలోచనలే వారితో పాటు లక్షల మందికి ఉపాధిని కల్పించాయి. వీరు కూడా అందరి లాగే ఏ కంపెనీలోనో ఉద్యోగం చేస్తూ ఇదే జీవితం అనుకుని ఉంటె, ప్రపంచపు గతిని మార్చిన వ్యాపార సామ్రాజ్యాలు ఆవిర్భవించేవి కావు. వాటి గురుంచి మాట్లాడుకునే అవకాశం కూడా మనకు వచ్చి ఉండేది కాదు.
➤ ➤ ➤ ఎందుకు బిజినెస్ చేయాలి..?
నేటి మన భారతం లోని పేదరికం , నిరుద్యోగం గురుంచి, విన్నప్పుడు దీనికి కారణం అయిన నీతిమాలిన నాయకులను, అవినీతికి అలవాటుపడిన అధికారులను మనకు ఇష్టం వచ్చినట్టు తిడుతాం , కానీ వాటిని రూపుమాపడానికి మనం ఏమి చేయం, ఎందుకంటే , మన చుట్టూ ఉన్న సమాజం మార్చటానికి ఎవరో ఎక్కడ్నుంచో వస్తారని, మనం నమ్ముతాం కనుక. మనలోనే అనంతమైన శక్తి ఉందని మనం గుర్తించం, దాన్ని బయటకు తీయం, అపారమైన జ్ఞానాన్ని , అనంతమైన తెలివిని మనలో పెట్టుకుని, ఎవరో ఇంకొకరి దగ్గరికి, వారిచే లక్షల ప్యాకేజీ కోసం , మనలో ఉన్న వ్యాపార ఆలోచనలను మనతోనే అంతం చేసుకుంటున్నాము.
ప్రతి ఒక్కరి ఏవో కొన్ని వ్యాపార ఆలోచనలు ఉంటాయి, వాటిని బయటకు తీస్తే ఆ ఆలోచన తో పాటు, మీరు కూడా గొప్ప వారయ్య అవకాశం ఉంటుంది, కానీ వాటిని బయటకు తీయం, ఎందుకంటే...... భయం, మన మీద మనకు భయం,చేయగలనా లేదా అనే భయం , మన చుట్టూ ఉన్న సమాజం ఏమంటుందో అన్న భయం, చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తారేమో , ఇంట్లో తల్లితండ్రులు ఏమంటారో అన్న భయం, ఇలాంటి ఎన్నో భయాల మధ్య మనలో మెదడులో ఉద్భవించే కొత్త ఐడియా లను గడిచిపోయిన కాలం తో పాటే సాగనంపుతున్నాం.
మీ జీవితం లో ఒకే ఒక్క అడుగు, ఎంట్ర పెన్యూర్స్ గా మారటానికి, ...........చాలు .. మీ చుట్టూ ఉన్న ఎందరో జీవితాలను మీరొక్కరే మార్చవచ్చు ... ! కేవలం మీరొక్కరే .. ! మీ చుట్టూ ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉండనివ్వని, వాటిని మీకు అనుకూలంగా మలుచుకోండి.
అవకాశాల కోసం ఎదురుచూడటం మానుకో, నీ తెలివితో వాటిని సృష్టించుకో.
చరిత్రలో ఎందరో కూటికి కూడా గతి లేని వారు , వ్యాపార రాజ్యం లోకి అడుగుపెట్టి , శిఖరాలను చేరుకున్నారు.ఆనాటి వారి పరిస్థితులు మనకు లేవు కదా..!
మీ జీవితం లో ఒకే ఒక్క అడుగు, ఎంట్ర పెన్యూర్స్ గా మారటానికి, ...........చాలు .. మీ చుట్టూ ఉన్న ఎందరో జీవితాలను మీరొక్కరే మార్చవచ్చు ... ! కేవలం మీరొక్కరే .. ! మీ చుట్టూ ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉండనివ్వని, వాటిని మీకు అనుకూలంగా మలుచుకోండి.
అవకాశాల కోసం ఎదురుచూడటం మానుకో, నీ తెలివితో వాటిని సృష్టించుకో.
చరిత్రలో ఎందరో కూటికి కూడా గతి లేని వారు , వ్యాపార రాజ్యం లోకి అడుగుపెట్టి , శిఖరాలను చేరుకున్నారు.ఆనాటి వారి పరిస్థితులు మనకు లేవు కదా..!
ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మహా అయితే ఏమవుతుంది, ప్రాణాలైతే పోవు కదా.. ? జరిగేవి రెండే రెండు . ఒకటి వ్యాపారవేత్త గా మీరు ఎదిగితే ఈ ప్రపంచానికి మీరు ఒక గొప్ప విజేత గా పరిచయం అవుతారు, మీ చుట్టూ ఉన్న వారు మీకు జేజేలు పలుకుతారు. అదే ఓడితే మీకు మీరు సరికొత్తగా పరిచయం అయ్యే ఓ గొప్ప అవకాశం , జీవితమంటే ఏంటో తెలుసుకునే ఓ ఘనమైన భాగ్యం మీకు కలుగుతుంది.. ఒక సంపూర్ణమైన మానవ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి ....?
గుర్తుపెట్టుకోండి... !
మన వర్తమాన భారత దేశానికీ కావాల్సింది , ఇరవైనాలుగు గంటలు పనిచేసే ఉద్యోగులు కాదు,
ఆ ఉద్యోగాలను సృష్టించే తెలివైన వ్యాపారవేత్తలు ..
ఆ తెలివి మీలో ఉందా .. ?
ఆలోచించండి , ఒక్కసారి ఆలోచించండి.
written by,
M . R . RAVINDRA NATH TAGORE.
ఆలోచించండి , ఒక్కసారి ఆలోచించండి.
written by,
M . R . RAVINDRA NATH TAGORE.





