కొందరు మాత్రమే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో కూడా అందరిచే
ఆరాధింపబడుతూ తరగని చెరగని కీర్తి తో తరతరాలుగా ధ్రువతారలా
వెలిగిపోతుంటారు..., ఆ పేరు వింటే ప్రతి ఒక్క భారతీయుడి గుండె దేశ భక్తి
నిండిపోతుంది. తాను నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు కట్టుబడి, సత్యం ,
అహింసలనే ఆయుధాలుగా చేసుకుని, ఆనాటి బానిస భారతానికి స్వతంత్రం సాధించాడు
మహాత్మా గాంధీ . నాడు మోహన్ దాస్ కరం చంద్ గాంధీ లా చరిత్రలో
నిలిచిపోవాల్సిన వ్యక్తి నేడు మహాత్ముడిలా నేటికీ ప్రజల మన్ననలు
అందుకుంటూనే ఉన్నాడు.
మహాత్మ గాంధీ
గురించి మనం చిన్నప్పటి నుండి , ఇప్పటి వరకు ఎన్నో సార్లు వినే ఉంటాం. అతని
గురుంచి ఎన్నో పుస్తకాల్లో చదివి ఉంటాం కానీ, మహాత్మా గాంధీ గురుంచి మనకు
ఎంత తెలిసినప్పటికీ అది చాలా తక్కువ.
అసలు గాంధీ చిన్నప్పుడు ఎలా
ఉండేవాడు, అతను ఒక సామాన్య విద్యార్థా లేక తెలివైన విద్యార్థా, , తన
తోటి విద్యార్థులతో ఎలా ఉండేవాడు, పదమూడు సంవత్సరాలకే పెళ్లి
చేసుకున్నప్పుడు ఆ సమయంలో గాంధీ ఎలా ఆలోచించాడు, చిన్నప్పుడు గాంధీజీ కి
కస్తూర్బా గాంధీ కి మధ్యన సంబంధం ఎలా ఉండేది, ఇతర మతాల పైన , కులాలపైనా
అతని అభిప్రాయం ఎలా ఉండేది, చిన్నప్పుడు గాంధీజీ జీవితంలో జీవితం లో జరిగిన
మధురమైన , ఆసక్తికరమైన సంఘటనలు ఏవి, మహాత్మా గాంధీ ని పూర్తి గా
మార్చివేసిన సంఘటనలు ఏవి, ఏ పరిస్థితుల్లో అతను లా చదువుకోవటానికి
ఇంగ్లాండు వెళ్ళాడు, ఇంగ్లాండు లో ఆ మూడు సంవత్సరాలలో అతను ఎదుర్కొన్న
సంఘటనలు ఏవి, కరుడుగట్టిన బ్రహచర్యాన్ని ఎలా పాటించాడు. దక్షిణ ఆఫ్రికా లో
గాంధీజీకి అవమానం ఎలా జరిగింది, ఆ తరువాత అతను అక్కడ ఏం చేసాడు , అసలు
దక్షిణ ఆఫ్రికా కు ఎందుకు వెళ్ళాడు, తిరిగి ఎందుకు వచ్చాడు , భారతదేశం లో
గొప్ప గొప్ప వ్యక్తులకు గాంధీజీ కి మధ్య జరిగిన సంఘటనలు ఏవి,
స్వాతంత్రోద్యమం లో ఎలా వ్యవహరించాడు ,
అసలు ఒక మాములు వ్యక్తి అయిన గాంధీ, మహాత్మగాంధీ ఎలా అయ్యాడు.
మహాత్మ గాంధీ జీవితం లో మీకు తెలియని ఆసక్తికర విశేషాలు.. !
మీకు తెలియని మహాత్మ గాంధీజీ ని కొత్తగా పరిచయం చేసేందుకే ఈ నా ప్రయత్నం..
written by,
M.R. Ravindra Nath Tagore
written by,
M.R. Ravindra Nath Tagore


anna next continuation ekkada
ReplyDelete