Followers

Search This Blog

Theme images by MichaelJay. Powered by Blogger.

About Simpro

Find Us On Facebook

About Me

My photo
hi, Iam Ravindra nath Tagore. I have to create this blog to write articles on some great persons and social elements to motivate all. This is very useful to you.

Gallery

About the Author

Featured post

గాంధీజీ ఆత్మహత్యాప్రయత్నం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 03

                  జీవితంలో మంచి వ్యక్తుల స్నేహం మంచి జీవితాన్ని ప్రసాదిస్తే, చెడు స్నేహం మాత్రం జీవితపు లోతులను తెలుసుకోగలిగేలా చేస్...

Contact Form

Name

Email *

Message *

Popular Posts

ఉపాధ్యాయుడే కాపీ కొట్టమని చెప్పినా, వినని గాంధీ...! - గాంధీ జీవిత విశేషాలు -- 01


              తరగతి గదిలో అంతా  నిశ్శబ్దం, ఒకవైపు ఉపాధ్యాయుడు గాంధీ వైపు కోపంగా చూస్తున్నాడు, చుట్టూ ఉన్న తన స్నేహితులు తనను చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు. ఆ నవ్వులో ఒక రకమైన అవమానం కనిపిస్తుంది. వారి చూపులు గాంధీ ని అమాయకుడిని చేస్తున్నాయి. కానీ గాంధీజీ మాత్రం తన సహనం ఏ మాత్రం కోల్పోలేదు, తాను చేసింది ఒప్పే అని , తాను ఏ తప్పు చేయలేదన్నట్లుగా తెలియపరిచే భావాలను తన ముఖంలో చూపిస్తున్నాడు. 
                                                అసలు ఏం జరిగింది, తరగతి గదిలో ఆ పరిస్థితులు  ఏర్పడటానికి గల కారణం ఏమిటి..?


            
                        అది గాంధీ హైస్కూల్  చేరిన మొదటి సంవత్సరం. ఆ రోజు తరగతి గదిలో పరీక్షలు జరుగుతున్నాయి. గాంధీ తన పరీక్షలో వ్రాయటం లో మునిగిపోయాడు, చాలా  శ్రద్దగా పరీక్షలు రాస్తున్నాడు. ఇంతలోనే విద్యాశాఖకు చెందిన జెయిల్స్ అనే అధికారి అకస్మాత్తుగా తరగతిగది లోకి ప్రవేశించాడు. అతన్ని చూసిన విద్యార్థులకు చెమటలు పట్టాయి. ఆ వెంటనే ఆ అధికారి విద్యార్థులు అక్షర జ్ఞానాన్ని పరీక్షించేందుకు ఓ ఐదు పదాలను రాయమని చెప్పాడు. వాటిలో కేటిల్ [kettle] అను పదం ఒకటి. దురదృష్టవశాత్తు గాంధీ ఈ పదాన్ని తప్పుగా వ్రాసాడు. ఇది చూసిన తన తరగతి ఉపాధ్యాయుడు గాంధీజి  కి సైగ చేసాడు. కానీ గాంధీ కి ఉపాధ్యాయుడు ఎందుకు సైగ చేస్తున్నాడో అర్థం కాలేదు. వెంటనే ఉపాధ్యాయుడు తన బూటు కాలితో నొక్కి తప్పును సరిదిద్దుకోమని , మరొక్క సారి సైగ చేసాడు. కానీ గాంధీ కి మాత్రం ఉపాధ్యాయుడి ప్రవర్తన అర్థం కాలేదు. ఎదురుగా ఉన్న పిల్లవాడి పలక చూసి తప్పు దిద్దుకోమని సైగ చేస్తున్నారన్న విషయం గాంధీ తెలుసుకోలేకపోయాడు. ఎదుటి వారి పలక నుండి చూసి రాయకుండా ఉండేందుకే ఉపాద్యాయుడు అక్కడ ఉన్నారని గాంధీజి భావన. అటువంటి ఉపాధ్యాయుడే తప్పు చేయమని ప్రోత్సహించటం గాంధీ కి నచ్చలేదు. మిగతా పిల్లలంతా ఆ ఐదు పదాలు సరిగ్గా వ్రాసారు, గాంధీ ఒక్కడు మాత్రం ఆ అధికారి చేత తిట్లు తినవలసి వచ్చింది. 

                     ఆ తరువాత ఆ ఉపాధ్యాయుడు గాంధీజీ ని పిలిచి మందలించాడు. తన అమాయకత్వాన్ని ,తనకు తెలియచేసాడు. కానీ గాంధీజీ కి మాత్రం ఉపాధ్యాయుడి ప్రవర్తన వింతగా తోచింది. ఈ సంఘటన జరిగిన తరువాత కూడా గాంధీజీ కి ఆ ఉపాధ్యాయుడి పై ఏ మాత్రం గౌరవం తగ్గలేదు. పెద్దల దోషాల్ని చూసి కళ్ళు    మూసుకోవాలని గాంధీజి భావన . ఆ తరువాత చాలా సార్లు ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తన గురుంచి , అతడి దోషాల గురుంచి గాంధీజీ దృష్టికి వచ్చిన అతనిపై ఏ మాత్రం వినయం తగ్గలేదు గాంధీజీ కి .


           
                          సామాన్యంగా అందరూ  బతకగలరు, కానీ తాను నమ్మిన సిద్దాంతాలను ఆచరిస్తూ, వాటిని తన జీవితం లోకి అన్వయించుకుంటూ బతకగలటం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది , అటువంటి వారే మహాత్ములుగా చరిత్ర పుటల్లో శిఖరాగ్రాన నిలిచి , జాతికి ఆదర్శం అవుతారు. చిన్నతనం లో జరిగిన ఆ సంఘటన గాంధీజీని మానసికంగా మరింత బలవంతుడిని చేసింది, సత్యానికి మరింత దగ్గరివాడ్ని చేసింది. అంత చిన్న వయసులో కూడా పక్క వారు ప్రేరేపించినా, తప్పు చేయాలన్న చిన్న తలంపు కూడా గాంధీజీ కు కలగలేదు. అందుకే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ , మహాత్మా గాంధీ అయ్యాడు.కొన్ని కోట్ల మంది కలలు కన్న స్వేఛ్ఛా భారతాన్ని సాధించి పెట్టాడు.



                                                                                       written by ,
                                                                           M.R. Ravindra Nath Tagore




మూలం : సత్యశోధన 
Read More
    17

మీకు తెలియని మహాత్మ గాంధీ జీవిత విశేషాలు

 
                కొందరు మాత్రమే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో కూడా అందరిచే ఆరాధింపబడుతూ తరగని చెరగని కీర్తి తో తరతరాలుగా  ధ్రువతారలా వెలిగిపోతుంటారు..., ఆ  పేరు వింటే ప్రతి ఒక్క భారతీయుడి గుండె దేశ భక్తి నిండిపోతుంది. తాను నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు కట్టుబడి, సత్యం , అహింసలనే ఆయుధాలుగా చేసుకుని, ఆనాటి బానిస భారతానికి స్వతంత్రం సాధించాడు మహాత్మా గాంధీ . నాడు మోహన్ దాస్ కరం చంద్ గాంధీ లా చరిత్రలో నిలిచిపోవాల్సిన వ్యక్తి నేడు మహాత్ముడిలా నేటికీ  ప్రజల మన్ననలు అందుకుంటూనే ఉన్నాడు.

                    మహాత్మ గాంధీ గురించి మనం చిన్నప్పటి నుండి , ఇప్పటి వరకు ఎన్నో సార్లు వినే ఉంటాం. అతని గురుంచి ఎన్నో పుస్తకాల్లో చదివి ఉంటాం కానీ, మహాత్మా గాంధీ గురుంచి మనకు ఎంత తెలిసినప్పటికీ అది చాలా  తక్కువ.

                   అసలు గాంధీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అతను ఒక సామాన్య  విద్యార్థా   లేక  తెలివైన విద్యార్థా, , తన తోటి విద్యార్థులతో ఎలా ఉండేవాడు, పదమూడు సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నప్పుడు ఆ సమయంలో గాంధీ ఎలా ఆలోచించాడు, చిన్నప్పుడు గాంధీజీ కి కస్తూర్బా గాంధీ కి మధ్యన సంబంధం ఎలా ఉండేది, ఇతర మతాల పైన , కులాలపైనా అతని అభిప్రాయం ఎలా ఉండేది, చిన్నప్పుడు గాంధీజీ జీవితంలో జీవితం లో జరిగిన మధురమైన , ఆసక్తికరమైన సంఘటనలు ఏవి, మహాత్మా గాంధీ ని పూర్తి గా మార్చివేసిన సంఘటనలు ఏవి, ఏ పరిస్థితుల్లో అతను లా చదువుకోవటానికి ఇంగ్లాండు వెళ్ళాడు, ఇంగ్లాండు లో ఆ మూడు సంవత్సరాలలో అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏవి, కరుడుగట్టిన బ్రహచర్యాన్ని ఎలా పాటించాడు. దక్షిణ ఆఫ్రికా లో గాంధీజీకి అవమానం ఎలా జరిగింది, ఆ తరువాత అతను అక్కడ ఏం చేసాడు , అసలు దక్షిణ ఆఫ్రికా కు ఎందుకు వెళ్ళాడు, తిరిగి ఎందుకు వచ్చాడు , భారతదేశం లో గొప్ప గొప్ప వ్యక్తులకు గాంధీజీ కి మధ్య జరిగిన సంఘటనలు ఏవి, స్వాతంత్రోద్యమం లో ఎలా వ్యవహరించాడు ,

             అసలు ఒక మాములు వ్యక్తి అయిన గాంధీ,  మహాత్మగాంధీ  ఎలా అయ్యాడు. 

  మహాత్మ గాంధీ జీవితం లో మీకు తెలియని ఆసక్తికర విశేషాలు.. !

 మీకు తెలియని మహాత్మ గాంధీజీ ని కొత్తగా పరిచయం  చేసేందుకే  ఈ నా ప్రయత్నం..

                           
                                                                                    written by,

                                                                              M.R. Ravindra Nath Tagore
                             

Read More
    1

Services

More Services

© 2014 The Tagore Times. Designed by Bloggertheme9 | Distributed By Gooyaabi Templates
Powered by Blogger.