Followers

Search This Blog

Theme images by MichaelJay. Powered by Blogger.

About Simpro

Find Us On Facebook

About Me

My photo
hi, Iam Ravindra nath Tagore. I have to create this blog to write articles on some great persons and social elements to motivate all. This is very useful to you.

Gallery

About the Author

Featured post

గాంధీజీ ఆత్మహత్యాప్రయత్నం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 03

                  జీవితంలో మంచి వ్యక్తుల స్నేహం మంచి జీవితాన్ని ప్రసాదిస్తే, చెడు స్నేహం మాత్రం జీవితపు లోతులను తెలుసుకోగలిగేలా చేస్...

Contact Form

Name

Email *

Message *

Popular Posts

గాంధీజీ ఆత్మహత్యాప్రయత్నం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 03


                  జీవితంలో మంచి వ్యక్తుల స్నేహం మంచి జీవితాన్ని ప్రసాదిస్తే, చెడు స్నేహం మాత్రం జీవితపు లోతులను తెలుసుకోగలిగేలా చేస్తుంది. గాంధీజీ జీవితంలో కూడా అచ్చం ఇలానే జరిగింది, తన చెడు మిత్రుని స్నేహం వలన గాంధీ జి తన జీవితంలో ఎన్నో చీకటి రోజులను అనుభవించవలసివచ్చింది. ఇతరుల్ని సంస్కరించాలనే బలమైన కోరిక గాంధీజీ ని నిలువునా ముంచివేసింది. వ్యభిచారపు కోరల్లో చిక్కుకున్నాడు, చివరికి తాను కట్టుకున్న ధర్మపత్నిని కూడా అనుమానించాడు.

➤ వ్యభిచార గృహ ప్రవేశం:-
  
                ఆ మిత్రుడి స్నేహం గాంధీజీ ని వ్యభిచార రంగం లోకి కూడా దింపేదే , కానీ ఆ సంఘటన నుండి తృటిలో బయటపడ్డాడు గాంధీజీ.ఒక రోజు ఆ మిత్రుడు గాంధీజీ ని వేశ్య ఇంటికి తీసుకుపోయాడు. గాంధీజీ కి కొన్ని వివరాలు చెప్పి గది లోకి పంపాడు. కావలసిన ఏర్పాట్లు అది వరకే చేసాడు, ఇవ్వవలసిన సొమ్ము కూడా అదివరకే ఇచ్చివేశాడు. గాంధీజీ ఆ పాపపు కోరల్లో చిక్కుకుని పోయాడు. గాంధీజీ కి నోటమాట రాలేదు. ఆ సమయంలో శరీరం లోని అవయవాలు అచేతన స్థితికి పడిపోయాయి. పరుపు మీద గాంధీజీ ఆమె పక్కన కూర్చున్నాడు. కానీ నోటి నుండి మాట లేదు, వెర్రి వేగం తో కొట్టుకుంటున్న తన  గుండె శబ్దం తనకు స్పష్టంగా వినిపిస్తున్నది.ఒక వైపు  చెమట కారుతుంది, మరో వైపు కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి. ఈ దారుణమైన పరిస్థితి నుండి తనని రక్షించమని ఆ భగవంతుడిని శతవిధాలా వేడుకున్నాడు గాంధీ,  కానీ ఇదంతా గమనిస్తున్న ఆమె చాలా సేపు ఓపిక పట్టింది. ఎటువంటి స్పందన లేక విగ్రహం లా కూర్చున్న గాంధీజీ ని ఆమె తిట్టడం ప్రారంభించింది.ద్వారం వైపు చూపి వెళ్లిపొమ్మని చెప్పింది. ఆ పరిస్థితిలో గాంధీజీ కి తన పై తనకు సిగ్గు వేసిన , ఆ తరువాత అటువంటి పరిస్థితిలో తనను కాపాడినందుకు గాంధీ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గాంధీ జీవితంలో ఇటువంటి పరిస్థితి నాలుగు సార్లు ఎదురైనప్పటికీ , అదృష్టం వల్ల వాటి నుండి తప్పించుకున్నాడు.


                   
                       ఇంతటి దారుణమైన పరిస్థితి ని అనుభవించినప్పటికీ ఇంకా గాంధీ కళ్ళు మూసుకుని పోయే ఉన్నాయి. ఈ సారి ఏకంగా ఆ మిత్రుడి మాటలు నమ్మి తాను అగ్ని సాక్షి గా మనువాడిన తన ధర్మ పత్ని అయిన కస్తూర్భా గాంధీ ని కూడా అనుమానించాడు, తన మిత్రుడు చెప్పిన మాటలను గాంధీ గుడ్డిగా నమ్మాడు, ఆమెను కష్టాల పాలు చేసాడు, హింసించాడు. కానీ ఆ తరువాత  తాను చేసిన తప్పుకు ఎంతో చింతించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకున్న గాంధీ భార్య , భర్త కు దాసి కాదని, అతడి సహచారిణి అని, సహధర్మ చారిణి  అని,ఇద్దరికి సుఖ దుఃఖాలలో సమాన భాగస్వామ్యం ఉందని తెలుసుకోగలిగాడు. ఆనాడు తన భార్య పట్ల  మూర్ఖంగా వ్యవహరించినందుకు గాంధీజీ కి తనపై తనకే కోపం వేసేది.

➤ సిగరెట్ల కోసం ఆత్మహత్యా ప్రయత్నం :- 

          ఆ మిత్రుడి సావాసం వదిలేసిన తరువాత ఈ సారి గాంధీజీ కి తన బంధువైన  ఒకరితో స్నేహం కుదిరింది. ఒక సమయంలో గాంధీజీ కి తన బంధుమిత్రుడి కి సిగరెట్ తాగాలని ఆశ కలిగింది, కానీ చేతిలో డబ్బు లేదు, సిగరేట్ తాగితే గల ప్రయోజనం ఏమిటో. దాని వాసనతో గల మజా ఏమిటో ఇద్దరిలో ఎవ్వరికీ తెలీదు, కానీ పొగ తాగాలన్న ఆశ మాత్రం వదల్లేదు. గాంధీజీ పినతండ్రికి కి కూడా ఈ అలవాటు ఉండేది. కొని తాగడానికి చేతిలో డబ్బులేక వారి పినతండ్రి కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలను ఏరుకుని తాగేవారు. అయితే అవి అనుకున్నప్పుడల్లా దొరికేవి కావు, దొరికిన ఎక్కువ పొగ వచ్చేవి కాదు, అందువల్ల ఇంట్లో పనిచేసే నౌకర్ల డబ్బు దొంగలించి వాటితో బీడీలు కొని తాగేవారు. కొన్ని రోజుల పాటు ఈ తతంగం బాగానే సాగింది. అయితే  ఈ పద్ధతి కూడా అనుకున్నప్పుడల్లా సాధ్యపడేది కాదు. అందుకే ఈ సారి కొన్ని మొక్కల కాడలకు సన్నని బెజ్జాలు ఉంటాయని , వాటిని సిగరెట్లుగా మాదిరిగా కాల్చవచ్చని ఎక్కడో విన్నారు. వాటిని కూడా ప్రయత్నించి చూసారు. అయినా వీటితో కూడా తృప్తి కలగలేదు. తమ ప్రయత్నాలన్ని విఫలమైనా ఇద్దరికీ పొగ తాగటం మీద కోరిక మాత్రం  చావలేదు.

                      
                        తమ పరిస్థితి మీద ఇద్దరికీ విసుగు వచ్చింది. పెద్దల అనుమతి లేకుండా ఏమి చేయలేకపోతున్నందుకు వారి మీద వారికే భాధ వేసింది. తమకు స్వాతంత్య్రం లేనందుకు ఎంతగానో చింతించారు. చివరికి విసిగి వేసారి పోయి, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మెత్త గింజలు విషం అని తెలుసుకున్నారు, వాటి కోసం వెతుకుంటూ అడవికి వెళ్లి వాటిని తీసుకువచ్చారు. సాయంకాలం వాటిని తినాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న ముహూర్తానికి కేదరేశ్వరుని ఆలయానికి వెళ్లి దీపం ప్రమిదలో నెయ్యిపోసి దానిని  వెలిగించి, ఇద్దరు దైవ  దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత ఆలయం నుండి బయటకు వచ్చి, నిర్మానుష్య ప్రాంతం కోసం వెదికారు. ఎవ్వరు లేని చోటుకు వెళ్లి చావాలనుకున్నారు. అలా ఒక  చోటుకి వెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ..... ఇదే సమయంలో వింత ఆలోచనలు ఇద్దరినీ చుట్టుముట్టాయి. వెంటనే ప్రాణం పోకపోతే ఎలా..?, చస్తే ఏం లాభం ..?, ఎవరికి లాభం..?, చచ్చి ఏం సాధించినట్టు, స్వాతంత్య్రం లేకుండా బ్రతకకూడదా..? వంటి ఆలోచనలతో ఇద్దరి బుర్ర వేడెక్కిపోయింది. ఒకరి కళ్ళల్లో మరొకరికి మృత్యు భయం స్పష్టంగా కనిపిస్తుంది. మరణ భయం తో కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి, ప్రాణ భయం తో వేడెక్కిన చెమట శరీరం నుండి కారుతుంది. అంతే మృత్యు ఆలోచనలను చూసిన వారు చేతిలో ఉన్న ఉమ్మెత్త గింజలను కిందకు పడేసారు. ఇప్పుడు బ్రతకాలన్న ఆశ ఇద్దరికీ మొదలయింది. కానీ.... అప్పటికే గాంధీ మూడు ఉమ్మెత్త గింజలను తిన్నాడు. చావంటే భయం తో , బ్రతకాలన్న కోరికతో ప్రాణాలు నిలుపుకునేందుకు రామ మందిరానికి పరుగు తీశారు, అక్కడ దేవుడిని ప్రార్థించి, ఇక మెల్లగా ఇద్దరు ఇంటి ముఖం  పట్టారు.

                                         జీవితంలో మనకు తారసపడే ప్రతి ఒక్కరు మనకు కొత్త పాఠాన్ని నేర్పుతారు. అది మంచి వ్యక్తులైనా  , చెడ్డ వ్యక్తులైనా , అందులో కొందరు ఎలా బతకాలో నేర్పిస్తే, మరికొందరు ఎలా బతకకూడదో నేర్పిస్తారు. కొందరు ఏది ఒప్పో తెలియజేస్తే , మరికొందరు ఏది తప్పో తెలియజేస్తారు. ఏది ఏమైనా కొత్త వ్యక్తుల సాంగత్యం మాత్రం ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తూనే ఉంటుంది. చెడు వ్యక్తుల స్నేహం వలన చిన్న వయసులోనే గాంధీజీ  జీవితపు చీకటి కోణాన్ని తెలుసుకున్నాడు.  ఆ స్నేహమే తన ఆలోచనలు మార్చుకునేలా, తనను తాను ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరిచుకునేలా చేసింది.  


                         జీవితంలో మనం ఎంత గొప్ప స్థితికి చేరుకున్నప్పటికీ బాల్యం యొక్క మధురానుభూతులు కళ్ళ ముందు కదలాడగానే కళ్ళు చెమర్చక తప్పదు. తన అందమైన అనుభవాలతో గుండె ను బరువు చేయగల శక్తీ ఒకే ఒక్క బాల్యానికి మాత్రమే ఉంది. అందుకే  ప్రతి ఒక్కరికి బాల్యం తిరిగిరాని ఒక  మధురమైన అనుభవం. భారత దేశానికీ జాతిపితగా , ప్రపంచ దేశాలకు అహింసావాదిగా చరిత్రలో  చిరకాలం నిలిచిపోయే గాంధీజీ తన బాల్యంలో ఎన్నో తుంటరి పనులు చేసాడు. తన స్నేహితులతో కలిసి ఎనో అల్లరి పనులు చేసి, తన బాల్యాన్ని అందమైన అనుభవంగా మలుచుకున్నాడు.

                     మరి మీ బాల్యం..?
                                               
                                                                               written by,
                                                                                   M.R. Ravindra Nath Tagore

                                                                                   మూలం :సత్యశోధన

     
                      

➣ Next Episode:-

                  మనలో  ఎవ్వరూ  థామస్ అల్వా ఎడిసన్ ను నిజంగా చూడలేదు. ఐన్ స్టీన్ యొక్క గొప్పలు వినడమే తప్ప అతని మేధస్సు ను కళ్లారా చూసే  అదృష్టం మనలో ఎవరికి లేదు. Newton laws చదవటమే తప్ప అతనితో  మనకెవ్వరికి పెద్దగా పరిచయం లేదు. చరిత్ర గతిని , మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చివేసే ఆవిష్కరణలు చేసిన ఎందరో శాస్త్రవేత్తలు ఈ నేల పై నడయాడినప్పుడు మనమింకా ఊపిరి పోసుకోలేదు. కానీ ఒక్క వ్యక్తి గురుంచి తెలుసుకుంటే అతను బ్రతుకుతున్న ఈ 21 వ  శతాబ్దంలో  నేను కూడా బ్రతికాను అని  సగర్వంగా చెప్పుకోవచ్చు. అతని గురుంచి పూర్తిగా తెలుసుకుంటే ఇతనికి మానవాతీత శక్తులు కానీ ఉన్నాయా..? మంత్రాలు , తంత్రాలు కానీ తెలుసా...? అని ఆశ్చర్యపోక  తప్పదు. ఎందుకంటే అతను అందరిలా ఈ ప్రపంచం మారాలి అని అనుకోలేదు, తన మేధస్సుతో ...., తన ఆలోచనలతో.... తన ఆవిష్కరణలతో ఈ ప్రపంచాన్ని మారుస్తున్నాడు.
                                                                                 ఎవరతను..?
                                                                                             తెలుసుకోవాలంటే
just wait ....
               అంతకన్నా ముందు, TheTagoreTimes.blogspot.com ను మీ మెయిల్ తో ఫాలో అవ్వండి.


                                             ****comment below****
Read More
    13

Services

More Services

© 2014 The Tagore Times. Designed by Bloggertheme9 | Distributed By Gooyaabi Templates
Powered by Blogger.