Followers

Search This Blog

Theme images by MichaelJay. Powered by Blogger.

About Simpro

Find Us On Facebook

About Me

My photo
hi, Iam Ravindra nath Tagore. I have to create this blog to write articles on some great persons and social elements to motivate all. This is very useful to you.

Gallery

About the Author

Featured post

గాంధీజీ ఆత్మహత్యాప్రయత్నం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 03

                  జీవితంలో మంచి వ్యక్తుల స్నేహం మంచి జీవితాన్ని ప్రసాదిస్తే, చెడు స్నేహం మాత్రం జీవితపు లోతులను తెలుసుకోగలిగేలా చేస్...

Contact Form

Name

Email *

Message *

Popular Posts

ఫ్లిఫ్ కార్ట్ అసలు చరిత్ర మీకు తెలుసా..?

    0

                            ఎంచుకున్న రంగంలో ఇష్టపడి కష్టిస్తే ,ఆకాశమే హద్దుగా చెలరేగిపోవచ్చు. పట్టుదల ఉంటే,ఎంతటి విపత్కర పరిస్థులలోనైనా అనుకూలంగా మార్చుకొని విజయాన్ని చేరుకోగలం . కష్టపడే తత్వం ఉంటే విజయమే మనకు దాసోహం అంటుంది. అందుకు సాక్షమే ఓ ఇద్దరు స్నేహితుల జీవన విజయ గాథ.
                             ఇద్దరికీ అమెజాన్ లో మంచి ఉద్యోగం. జీవితం సాఫిగా సాగిపోతుంది.అయినాఇద్దరిలో ఏదో తెలియని వెలితి. ఏదో సాధించాలని మనసులో ఆరాటం. తమను తాము నిరూపించుకోవాలని పట్టుదల. తమ మదిలో మెదిలిన ఈ ఆలోచనలే ,తమను అమెజాన్ కంపెనీ నుండి బయటకు వచ్చేలా చేసాయి. అంతే కాదు ఆ ఇద్దరి స్నేహితులను ఆన్ లైన్ షాపింగ్ మార్కెట్ లో రారాజులను చేసాయి. ఆ స్నేహితులే సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్. వీరిద్దరూ కలిసి స్థాపించినదే ఫ్లిప్ కార్ట్.

సచిన్ బన్సల్ మరియు బిన్నీబన్సల్ గురించి:
       
                            1981అగస్ట్ 5న చండీఘర్ లో పుట్టిన సచిన్ బన్సల్, చిన్నప్పటి నుండే చదువులో చాల చురుకుగా ఉండేవాడు. ఆ చురుకుతనమే తనను ఢిల్లీ లోని ఐఐటీ నుండి గ్రాడ్యుయేట్  పట్టా పొందేలా చేసింది. కాలేజీ రోజుల్లోనే బిజినెస్ పైన, మార్కెటింగ్ పైన ఎంతో ఇంట్రెస్టును చూపేవాడు సచిన్ బన్సల్.
    
                  ఫ్లిప్ కార్ట్ సహవ్యవస్థాపకుల్లో మరొకరు బిన్నీ బన్సల్, తాను కూడా చండీఘర్  కు చెందిన వాడే. వీరిద్దరూ కలిసి మొదట అమెజాన్ లో ఉద్యోగులుగా పనిచేసారు. అయితే వీరిద్దరూ అమెజాన్ లో ఉన్నపుడే ఏదయినా సొంతంగా  బిజినెస్ చేద్దామని , ఉన్న ఉద్యోగాన్ని వదిలి 2007 వ సంవత్సరంలో బయటకు రావటం జరిగింది.మొదట వీరిద్దరూ కలిసి గూగుల్,యాహు లాంటి ఒక సెర్చ్ ఇంజిన్ కంపెనీను స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. అయితే ఆ ఆలోచనను వదులుకొని , భారత దేశం లో ఇ - కామర్స్ బిజినెస్ కు భవిష్యత్తులో మంచి మార్కెట్ ఉందని గ్రహించి అటువైపు అడుగులు వేయటం ప్రారంభించారు.

ఫ్లిప్ కార్ట్ కు శ్రీకారం:


              చేతిలో ఉన్న నాలుగు లక్షల రూపాయలతో బెంగుళూరును కేంద్రంగా చేసుకొని 2007 లో ఫ్లిఫ్ కార్ట్ కు శ్రీకారం చుట్టారు.మొదట కేవలం పుస్తకాలను మాత్రమే ఆన్ లైన్ లో అమ్మేవారు. వారే సొంతంగా స్కూటర్ మీద వెళ్లి కస్టమర్లకు పుస్తకాలను డెలివరీ చేసేవారు. అయితే ఆ తరువాతే వారికి తెలిసింది భారత దేశంలో ఇ - కామర్స్ బిజినెస్ రన్ చేయటం అంత సులువు కాదని. ప్రజలు ఆన్ లైన్ లో షాపింగ్ చేయటానికి వెనుకడుగు  వేస్తున్నారని అర్థం చేసుకొన్నారు.ఇందుకు గల ప్రధాన కారణం ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించటానికి ప్రజలు భయపడటం. దీనినే తమ వ్యాపార సూత్రంగా మలుచుకొని, మొట్ట మొదటి సారిగా దేశంలో కాష్ ఆన్ డెలివరీ ను ప్రవేశపెట్టారు.ఆ తరువాత తమ విజయాలకు విరామం లేకుండా పోయింది.
                   2008 లో సచిన్  బన్సల్ ఓక ఇంటర్వ్యూ లో "మేము నిమిషానికి ఒక పుస్తకాన్ని అమ్ముతున్నామని చెప్పాడు". ఈ ఒక్క మాట చాలు ఆ ఇద్దరు స్నేహితులు ఈ విజయాన్ని చేరుకోవటానికి ఎంత  కష్టపడ్డారో. ఆ కష్టమే వారిని ఒక సంవత్సరం తిరిగే లోపల దేశం లోనే అతి పెద్ద ఆన్లైన్ బుక్ సెల్లింగ్ స్టోర్ గా నిలబడగలిగింది. ఆ తరువాత అనేక పెద్ద పెద్ద కంపెనీలు ఫ్లిప్ కార్ట్ లో పెట్టు బడులు పెట్టడంతో అమెజాన్ లానే వీరు కూడా మొత్తమ్ అన్ని వస్తువులను ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మటం మొదలు పెట్టారు.

            ఆన్ లైన్ లో షాపింగా అంటూ అందరు వారిని అవహేళన చేసారు. వీటన్నింటిని వదిలి ఏదయినా ఉద్యోగం చూసుకోమని సలహాలు ఇచ్చారు. అయినా వీరిద్దరిలో ఏ ఒక్కరు వెనుకడుగు వేయలేదు. మనసులో ఏదో సాదిస్తామన్న ప్రగాడ నమ్మకం ,వేటికి బెదరని తమ పట్టుదల, వాటన్నిటిని దాటేలా చేసాయి. ఇప్పుడు దేశం లోనే అతి పెద్ద ఇ - కామర్స్ సైట్ గా ఫ్లిప్ కార్ట్ ఓ వెలుగు వెలుగుతోంది

ఫ్లిప్ కార్ట్ గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాలు :
ఇప్పుడు ఫ్లిప్ కార్ కంపెనీ విలువ దాదాపు 15.5 బిలియన్ డాలర్లు.
 
నేడు ఫ్లిప్ కార్ట్ లో దాదాపు 33వేల మందికి పైగానే ఉద్యోగులు ఉన్నారు.
 
2012 లో ఫ్లిప్ కార్ట్ letsbuy అనే కంపెనీని దాదాపు 25 మిలియన్ డాలర్లు చెల్లించి సొంతం చేసుకుంది

➠ 2014
లో myntra అనే ఆన్ లైన్ క్లాత్ స్టోర్ ను కొనుగోలు చేసి, తమ వ్యాపార సామ్రాజ్యన్ని మరింత విస్తరించారు.

➠ 2014 లో ఫ్లిప్ కార్ట్ big billion sale ను ప్రారంభించింది. ఈ సేల్ లో వస్తువులను డిస్కౌంట్ల మీద అతి తక్కువ ధరకు అమ్మి కేవలం పది గంటల్లోనే 600 కోట్ల వ్యాపారం చేసింది.

ఫ్లిప్ కార్ట్ అమ్మిన మొట్ట మొదటి పుస్తకం "leaving microsoft to change the world".దీనిని కొనుగోలు చేసింది ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన v.v.k చంద్ర అనే వ్యక్తి.

ఎకనామిక్ టైమ్స్ 2012 మరియు 2013 సంవత్సరాలకు గాను Entrepreneu of  the year అవార్డు ను సచిన్ బన్సల్ కు ప్రకటించింది.

బిన్నీ బన్సల్, గూగుల్ కంపెనీలో జాబ్ కోసం రెండు సార్లు అప్లై చేసుకుంటే,రెండు సార్లు అతనిని రిజెక్ట్ చేసింది.

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ కు సచిన్ బన్సల్ చైర్మన్ గా, బిన్నీ బన్సల్ c.e.o గా వ్యవహరిస్తున్నారు.
2017 జులై లో ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ కంపెనీని750 మిలియన్ డాలర్లకు కొంటామని ఆఫర్ చేసారు. కానీ స్నాప్ డీల్ కంపెనీ 1 బిలియన్ డాలర్లు అడగటంతో ఆ డీల్ అంతటితో ముగిసిపోయింది.


సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ వీరి పేర్ల చివర బన్సల్ ఉన్నంత మాత్రం వీరిరువురికి ఎటువంటి బంధుత్వం లేదు. వీరిద్దరూ ఒకే ప్రాంతానికి  చెందినా,ఒకే కాలేజ్ లో చదువుకున్నప్పటికీ ,అమెజాన్ కంపెనీలో చేరేంత వరకు వారికి ఒకరికి ఒకరు పరిచయం లేదు.

                              తమలో ఉన్నఅసాధారణ  నైపుణ్యం,విజయాన్ని చేరుకోవాలనే తమ అకుంఠిత దీక్ష, ఎన్ని ఆటంకాలు ఎదురైన చెక్కుచెదరని తమ ఆత్మ విశ్వాసం ఈనాడు వారిని వేల కోట్ల విలువ చేసే కంపెనీకి అధిపతులనే కాదు ,దేశ ప్రజల ముందు వారిని జీవన విజేతలుగా నిలబెట్టాయి. అసాధారణ నైపుణ్యాలు గల భారత దేశ యువతకు నేడు వారు స్పూర్తి ప్రదాతలుగా నిలిచారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా ,ఆ రంగంలో కష్టానికి ఇష్టం తోడైతే విజయానికి తిరుగుండదని ఈనాడు ఈ స్నేహితుల ద్వారా మరొక్క సారి నిరూపితమైంది

                                                  by

                           M.R . Ravindra Nath Tagore
                                                          

No comments:
Write comments

thank you for your great words

Services

More Services

© 2014 The Tagore Times. Designed by Bloggertheme9 | Distributed By Gooyaabi Templates
Powered by Blogger.