Followers

Search This Blog

Theme images by MichaelJay. Powered by Blogger.

About Simpro

Find Us On Facebook

About Me

My photo
hi, Iam Ravindra nath Tagore. I have to create this blog to write articles on some great persons and social elements to motivate all. This is very useful to you.

Gallery

About the Author

Featured post

గాంధీజీ ఆత్మహత్యాప్రయత్నం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 03

                  జీవితంలో మంచి వ్యక్తుల స్నేహం మంచి జీవితాన్ని ప్రసాదిస్తే, చెడు స్నేహం మాత్రం జీవితపు లోతులను తెలుసుకోగలిగేలా చేస్...

Contact Form

Name

Email *

Message *

Popular Posts

స్టీవ్ జాబ్స్ జీవితపు చివరి మాటలు --- తన మాటల్లోనే

    28

                                       

                  సామాన్యంగా ఆలోచించేవారు  అద్భుతాలను  చూడాలనుకుంటారు. కానీ గొప్పగా ఆలోచించే వాళ్ళు మాత్రమే  అద్భుతాలను సృష్టించాలనుకుంటారు.  కొందరు ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు, కానీ కొందరు మాత్రమే ఉద్యోగాలను ఇవ్వాలని అనుకుంటారు. చదువు మీద విరక్తితో కనీసం డిగ్రీ పట్టా కూడా అందుకోని అతను  వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. టెక్నాలజీ రంగం లో అతను చేసిన ప్రతి ఆవిష్కరణ ఒక గొప్ప అద్భుతం. అతను వచ్చాకే అసలు సిసలైన టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం అయ్యింది.  20 ఏళ్లకే ఆపిల్ కంపెనీ ప్రారంభించి దానిని శిఖరాగ్రాన నిలబెట్టాడు. అతనే స్టీవ్ జాబ్స్.   

               ఎవరికి తెలుసు జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో . .కష్టాల కడలిని దాటిన అతనికి, మళ్ళీ వాటితో పరిచయం  ఏర్పడుతుందని బహుశా అతను కూడా ఊహించివుండడు. అతని ప్రతిభను చూసిన కాలం అసూయ పడి ఈ సారి కష్టాలను కాన్సర్ రూపం లో  పంపించింది.   ఎన్నో అద్భుతాలను సృష్టించిన స్టీవ్ జాబ్స్ కు మృత్యు దేవత పలకరించేంత వరకు జీవితం అంటే ఏంటో  తెలుసుకోలేకపోయాడు.  ఇన్ని రోజులు తానేం కోల్పోయాడో తన చివరి రోజుల్లో తెలుసుకున్నాడు. తన చివరి రోజుల్లో, మృత్యు దేవత ముంగిట ఉన్న అతను తన జీవితం గురించి  రాసుకున్న మాటలు , ఎంతో మంది హృదయాలను కంట తడి పెట్టించాయి.


                     "వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప వేరే ఆనందం నాకు తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు, ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే. ఇన్నాళ్లు నేను గర్వపడిన పేరు, డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తుంది. ఈ నిశిరాత్రిలో - నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తుంది. నాకిప్పుడనిపిస్తోంది..... జీవితంలో సరిపడ డబ్బు సంపాదించాక , మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయ్. కళలు, అనుబంధాలూ , చిన్నప్పటి కలలూ, కోరికలూ , సేవ.. ఇలా  డబ్బు కు మించిన కాల ప్రపంచం చాలా ఉంది. కానీ డబ్బు వెంట పెట్టె పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ.  ఇతరుల మనసులోని ప్రేమను గుర్తించటానికే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రం విలువనిచ్చే కాల్పనిక జగత్తును  మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఆఖరి ప్రయాణములో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకెళ్లగలిగేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమ పూర్వక అనుభూతులే ఎప్పుడు మనతో ఉంటాయి. మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. నిజం, అంత మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది."

స్టీవ్ జాబ్స్ తన చివరి రోజుల్లో

                   "ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగం తో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక  డ్రైవరును నియమించుకోగలవు. నీ కోసం సంపాదించిపెట్ట్టె ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ భాదను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు కానీ చేజారిన జీవితం మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా  - కథ ముగిసే రోజు, తెర పడే రోజు ఒకటి వస్తుంది. - అప్పుడు ఎంత ఆరాటపడిన కాలం వెనక్కి మళ్లదు , అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ స్నేహితులను ప్రేమించు. ఆనందంగా జీవించు. అందరిని ఆనందంగా ఉంచు. " 
  
           

                    బరువెక్కిన విషాద హృదయంతో స్టీవ్ జాబ్స్ 2011లో ఈ లోకాన్ని వీడవలసివచ్చింది. కానీ తన జీవితంలో   తాను వేసిన ప్రతి అడుగు ప్రతి ఒక్కరికి ఆదర్శమే. చేసిన ప్రతి ఆవిష్కరణ ఒక గొప్ప అద్భుతమే. జీవితానికి తాను ఇచ్చిన నిర్వచనం , ఎంతో మందికి ఆదర్శప్రాయం. తాను జీవించిన జీవితంతోనే కాదు, తన చివరి మాటలతో కూడా, ఎంతో మందిని మేల్కొలిపాడు స్టీవ్ జాబ్స్.
చివరగా 
        చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోకండి, మీకు ఆనందం కలిగే  పనులు మాత్రమే చేయండి.
             
                                                                   Written by
                                                  M.R . RAVINDRA NATH TAGORE

     
                                        teluguinspireworld111@gmail.com.

28 comments:
Write comments
  1. good job ravi ......be motivated and keep motivating......

    ReplyDelete
  2. soooooooo inspirational annayya...

    ReplyDelete
  3. super motivational stories anna

    ReplyDelete
  4. nice stories
    u r the upcoming story writer for my movies

    ReplyDelete
  5. nice bro
    the way of writing is really nice .
    u r really involving the reader into the story

    ReplyDelete
  6. Replies
    1. thank u ramya yadav for giving u r great words.

      Delete
  7. i am so inspired brother.thank you so much.

    ReplyDelete
  8. Chinna keep motivating like this. Don't lay a step back while sharing good things with others.

    ReplyDelete
  9. thank you tagore for giving this great real life story about steve jobs and expecting more stories from you
    and add more information
    keep it up tagore

    ReplyDelete
    Replies
    1. thank u sister and I'll continue this only with all u r support.

      Delete
  10. Nice motivational story bro.......

    ReplyDelete
  11. really superb bro, it gives muchh information about great personalities.its very usefull to me tq bro.

    ReplyDelete
  12. thank u very much bro for giving us such an beautiful story and making us inspire

    ReplyDelete

thank you for your great words

Services

More Services

© 2014 The Tagore Times. Designed by Bloggertheme9 | Distributed By Gooyaabi Templates
Powered by Blogger.