దెంగన్ మల్ మహారాష్ట్ర లోని ఓ మారుమూల గ్రామం. నాగరికతకు సంబంధం లేకుండా
అభివృద్ధి కి సుదూర దూరాన కరువు కాటకాలలో మగ్గుతున్న ఓ గ్రామం. కాలం
కన్నెర్ర చేసిందో, లేక విధి వైపరీత్యమో ఏమో అక్కడ ఒక్క అవసరం కోసం వారు
పాటిస్తున్న సంప్రదాయం తెలుసుకుంటే ఆశ్చర్యమే కాదు, మనసు కొంత వ్యధ కు
గురికాక తప్పదు. అక్కడి స్త్రీలు పడుతున్న బాధ వర్ణనాతీతం. సంస్కృతి,
సంప్రదాయాలను పెద్ద పీట వేసిన మన భారతదేశంలో ఒక వ్యక్తి ఒక స్త్రీని
మాత్రమే పెళ్లాడాలి అనేది అందరు ఆమోదించినది, ఆచరిస్తున్నది కూడా. కానీ దెంగన్ మల్ గ్రామంలో మాత్రం ఒక పురుషుడికి ముగ్గురు, నలుగురు భార్యలు.
కారణం ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నీటి కొరత.
దెంగన్ మల్ గ్రామంలో ఒక మహిళ ఇంటి దగ్గరే ఉండి, ఇంటి పనులను, చిన్న పిల్లలను చూసుకుంటే, మిగతా ఇద్దరు, కిలోమీటర్ల దూరంలో ఉన్న బావుల నుండి నీళ్లు తీసుకురావటమే వారి పని. కేవలం నీళ్లు తేవటం కోసమే గ్రామంలోని పురుషులు ముగ్గురు, నలుగురు స్త్రీలను పెళ్లిచేసుకుంటారు. తరతరాలుగా ఇక్కడ జరుగుతున్నది ఇదే తంతు. నేడు భారత దేశం సామాజికంగా, సాంకేతికంగా, ఆర్థికంగా అనేక రంగాలలో ఎంతో కొంత చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందినప్పటికీ ఇటువంటి పరిస్థితులు మనం ఇన్నాళ్లు సాధించిన అభివృద్ధినే ప్రశ్నిస్తాయి. కేవలం మన భారతదేశమే కాదు, ప్రపంచంలోని ఎన్నో దేశాలు నీటి కొరతను ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నాయి.
ప్రతి ఒక్కరు అవసరం మేరకే నీటిని వాడి, వృథాను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక సామాన్య మానవునిలో నీటి వృథాను అరికట్టాలి అనే ఆలోచన రానంత వరకు అవన్నీ వ్యర్థమే. అందుకే ప్రతి ఒక్కరు నీటి వృథాను అరికట్టడం అనేది తమ సామజిక భాద్యత అని తెలుసుకోవాలి.ఎడారిలో బ్రతుకు పోరాటం చేసే వారికి తెలుసు ఒక్క చుక్క నీటి బొట్టు విలువ. మన వెనుకటి తరాలు మనకు అవసరమైన వనరులను, కలుషితం కాని భూమిని,కలుషితం కాని గాలిని , కలుషితం కాని పర్యావరాన్ని మనకు వారసత్వంగా ఇస్తే , వాటిని కలుషితం చేయటమే మన పనిగా పెట్టుకుని, భావితరాల భవిష్యత్తును అంధకారం చేస్తున్నాం.
ఇప్పటికీ రాజస్థాన్ లోని చాలా ప్రాంతాలలో పదమూడు, పదనాలుగు సంవత్సరాల వయసు గల ఆడపిల్లలు కిలోమీటర్ల దూరం నుండి నీటిని తేవటమే వారి రోజు వారీ పని. అందరిలాగా బాల్యం యొక్క మధురానుభూతులను అనుభవించకుండా, చదువుకు దూరంగా రోజులు గడుపుతున్నారు. దెంగన్ మల్
గ్రామంలోని పరిస్థితుల గాని, రాజస్థాన్ లోని అమ్మాయిల పరిస్థితులు గాని ఇప్పుడు మన చుట్టూ లేవు. అందుకే మన భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వినియోగించాలి. గుక్కెడు మంచి నీటి కోసం భవిష్యత్ తరాలు యుద్ధాలు చేసుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి.
ప్రపంచ జనాభా 760 కోట్లైతే అందులో దాదాపు కోటి మందికి అసలు మంచి నీటి సదుపాయమే లేదు. మరో 270 కోట్ల మంది ఏడాదిలో నెల రోజులపాటు చాలినంత నీరు లభ్యం కాక కష్టాలు పడుతున్నారు. అంతే కాదు ప్రపంచంలోని 500 మహానగరాలు మున్ముందు తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కోక తప్పదని అనేక సర్వే లు చెపుతున్నాయి. ఇప్పటికైనా సామాన్య మానవుడి నుండి శాసించే ప్రభుత్వాలు వరకు ప్రతి ఒక్కరు మేల్కొని నీటి పొదుపు మార్గాలు ఆచరించకపోతే జరగబోయే పరిణామాలను ఊహించటం కూడా కష్టమే.
గ్రామంలోని పరిస్థితుల గాని, రాజస్థాన్ లోని అమ్మాయిల పరిస్థితులు గాని ఇప్పుడు మన చుట్టూ లేవు. అందుకే మన భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వినియోగించాలి. గుక్కెడు మంచి నీటి కోసం భవిష్యత్ తరాలు యుద్ధాలు చేసుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి.
ప్రపంచ జనాభా 760 కోట్లైతే అందులో దాదాపు కోటి మందికి అసలు మంచి నీటి సదుపాయమే లేదు. మరో 270 కోట్ల మంది ఏడాదిలో నెల రోజులపాటు చాలినంత నీరు లభ్యం కాక కష్టాలు పడుతున్నారు. అంతే కాదు ప్రపంచంలోని 500 మహానగరాలు మున్ముందు తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కోక తప్పదని అనేక సర్వే లు చెపుతున్నాయి. ఇప్పటికైనా సామాన్య మానవుడి నుండి శాసించే ప్రభుత్వాలు వరకు ప్రతి ఒక్కరు మేల్కొని నీటి పొదుపు మార్గాలు ఆచరించకపోతే జరగబోయే పరిణామాలను ఊహించటం కూడా కష్టమే.
➤ ఇటీవల ఇండియా క్రికెట్ టీం, సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో టెస్ట్ మ్యాచ్ సందర్బంగా పర్యటించినప్పుడు, అక్కడి మేనేజిమెంట్ వారు నీటిని తక్కువగా వాడాలని, రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు స్నానం చేయరాదని ఇండియా క్రికెట్ టీం ను కోరుకోవటం, చూస్తే అభివృద్ధి చెందిన ప్రాంతాలు కూడా నీటి కొరతకు అతీతం కాదని అర్థం అవుతుంది.
➤ 2016 లో మహారాష్ట్రలో తీవ్రమైన నీటి కొరత కారణంగా ఏకంగా ఐపీల్ మ్యాచ్ లను వేరే ప్రాంతాలకు తరలించారు. చివరకి ప్రజలకు అవసరమైన నీటిని వేరే ప్రాంతాలనుండి రైళ్లల్లో తీసుకురావటం వంటి సంఘటనలు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
నేడు స్వలాభం కోసం మానవుడు చేసే కొన్ని పనులవల్ల జీవరాశి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని సమస్యలు మనకు సవాలుగా మారుతున్నాయి. వాటిలో నీటి కొరత ప్రధాన సమస్య. ఇప్పటికైనా మేల్కోకపోతే మానవాళికి తప్పదు మహా ముప్పు. కేవలం మన భవిష్యత్తే కాదు మన భావితరాల భవిష్యత్తు కూడా మన చేతులలోనే ఉందనేది మర్చిపోరాని విషయం.
ఆవిరవుతోంది జలం.
ఉద్యమించాలి మనం.
ఉద్యమిస్తే మనం.
ఉబికిరాదా జాలం.
గుర్తుపెట్టుకోండి.
"నేను ఒక్కడినే నీటిని పొదుపు చేసిన మాత్రాన ఎక్కడో ఉన్న వాళ్ళ కష్టాలు తీరవు కదా" అని ఆలోచిస్తే అంతకన్నా మూర్ఖపు ఆలోచన మరొకటి ఉండదు. మార్పు కై మొదట అడుగు నీతోనే ప్రారంభం అవ్వాలి. నీలో మార్పు రానంతవరకు నీ చుట్టూ ఉన్న సమాజములో కూడ మార్పు రాదు. వృధా చేసే ప్రతి నీటి బొట్టు రేపటి తరాల నీటి కష్టాలకు నాంది అని గుర్తించుకోండి. ఇకనైనా మారుదాం. చుట్టూ ఉన్న వారిని మార్చుదాం. నీటిని పొదుపుగా వాడుదాం.
Save Water.
Save World.
written by
M.R . Ravindra Nath Tagore






Thanks for letting you know about water savings.
ReplyDeletegreat job
Deletethanks for giving
ReplyDelete