అతని చురుకైన చూపు ను చూస్తే శత్రువు గుండెల్లో కూడా వణుకు పుడుతుంది.
అతని కోర మీసం పౌరుషానికే ప్రతీకగా నిలుస్తుంది . పుట్టింది బ్రాహ్మణ
కుటుంబం అయితేనేం ఎంతకైనా తెగించే పోరాట పటిమను, తల వంచని తత్వాన్ని
శరీరంలోని నరనరాలలో జీర్ణించుకున్న సమరయోధుడు అతను. కాశ్మీర్ నుండి
కన్యాకుమారి వరకు విస్తరించివున్న ఆ అఖండ బానిస భరత జాతికి స్వేచ్ఛా
వాయువులను ప్రసాదించటానికి తనకు తానే తన ప్రాణాలను భరత మాతకు బలి
ఇచ్చుకుని చరిత్రకెక్కిన అమరవీరుడు అతను. ఎవరు ఆ మహా వీరుడు, అతనే చంద్రశేఖర్ ఆజాద్.
అది 1921వ సంవత్సరం.
అదొక కోర్టు హాలు. పదిహేనేళ్ల కుర్రాడు కోర్టు బోనులో నిల్చుని ఉన్నాడు.
అతడిని ప్రశ్నిస్తున్న న్యాయాధికారి "నీ పేరేమిటి?" అని ప్రశ్నించాడు.
అందుకు అతని సమాధానం ఆజాద్ (స్వేచ్ఛ). ఒక్కసారిగా అతనికి మతి పోయింది.
అయినా తేరుకొని "నీ తండ్రి పేరేమిటి ?" అని ప్రశ్నించాడు. స్వతంత్రం అని
అతని సమాధానం. న్యాయమూర్తితో కోపం, అసహనం పెరిగిపోయాయి. అయినా ఓపిక పట్టి
"నీ ఇల్లెక్కడ?" అని ప్రశ్నిస్తే "కారాగారం" అని అతని సమాధానం. పదిహేనేళ్ల
వయసున్న ఆ బాలుడి సమాధానాలకు న్యాయమూర్తికి ఆగ్రహం తో పాటు, ఆశర్యం కూడా
కలిగింది. మొదట పదిహేను రోజుల కారాగార శిక్ష విధించినా ఆ తరువాత దానిని
పదిహేను కొరడా దెబ్బలుగా మార్చదు. ఒంటి మీద కొరడా దెబ్బ పడుతున్న ప్రతిసారి
"భారత్ మాతాకీ జై "అని నినదించిన మహా వీరుడు అతను. అతనే చంద్రశేఖర్ ఆజాద్.
➤ ఆజాద్ బాల్యం:
➤ ఆజాద్ బాల్యం:
1906
జులై 23 న జన్మించిన చంద్రశేఖర్ ను సంస్కృత పండితుణ్ణి చేయాలని
తల్లితండ్రుల కోరిక. అందుకోసమే వారణాసిలోని కాశీ విద్యాపీఠం లో
చేర్చారు.దేశంలో స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి.పంజాబ్ లో
జరిగిన జిలియన్ వాలాబాగ్ మారణకాండ చంద్రశేఖర్ ను తీవ్రంగా బాధించింది.
స్వరాజ్యఉద్యమంలోకి ఉరికాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తాను చదువుతున్న
విద్యా పీఠం ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ధర్నా చేయటంతో పోలీసులు
పట్టుకొని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. పదిహేను కొరడా దెబ్బలను
న్యాయాధికారి శిక్షగా విధిస్తే సంతోషంగా అనుభవించాడు. ఈ సంఘటన తరువాత
చంద్రశేఖర్ కాస్త చంద్రశేఖర్ ఆజాద్ గా పేరు పొందాడు.
➤ భగత్ సింగ్ కు మిత్రునిగా :
➤ భగత్ సింగ్ కు మిత్రునిగా :
విప్లవ పంథాలోనే దేశానికీ విముక్తి లభిస్తుందని నమ్మిన ఆజాద్, సంపూర్ణ
స్వతంత్రమే తన లక్ష్యమని నిర్ణయించుకున్నాడు. 1928 లో ఢిల్లీ లో ఫిరోజ్ షా
కోట్ల మైదానం దగ్గర ఆజాద్, భగత్ సింగ్ ను , సుఖ్ దేవ్ లను కలుసుకున్నాడు.
స్వతంత్ర సమపార్జనకు వీళ్లంతా విప్లవబాటను ఎంచుకొన్నారు. "హిందుస్థాన్
సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్" కూడా స్థాపించారు.
➤లాలా లజపతి రాయ్ మరణం :
➤లాలా లజపతి రాయ్ మరణం :
దేశంలో
సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. 1929 లో లాహోర్
లో జరిగిన నిరసన ప్రదర్శనలో 64 ఏళ్ళ వృద్దుడైన లాలా లజపతి రాయ్ మీద
సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి చేయటం తో ఆ దెబ్బలకు
ఓర్వలేక పంజాబ్ కేసరి నేలకొరిగాడు. ఆగ్రహం తో రగిలిపోయిన ఆజాద్ బ్రిటిష్
అధికారులను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. లజపతి రాయ్ మరణానికి
కారణమైన సాండర్స్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ సమయం లో పొరపాటున
మరో పోలీసును కాల్చి చంపారు. పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురులను ఓ
పోలీస్ వెంబడించి పట్టుకున్నాడు. దీంతో మితులను విడిపించటం కోసం ఆ పోలీస్
అధికారిని కూడా కాల్చిచంపాడు. తరువాత ముగ్గురు జాన్సీ పట్టణంలో
అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. 1929 లో మే
2న వీరి జాడను కనిపెట్టి వారు ఉంటున్న గదిని చుట్టుముట్టి ఒక్కసారిగా
తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ వారికి ఖాళీ గదే
దర్శనమిచ్చింది. అప్పటికే వారు అక్కడినుంచి తప్పించుకున్నారు.
బ్రిటిష్ అధికారులకు ఆజాద్ సవాలుగా మారాడు. ఆజాద్ ను సజీవంగా కానీ,
నిర్జీవంగా పట్టిఇచ్చిన వారికి ముప్పైవేల రూపాయల బహుమతిని ప్రకటించింది.
దీనికి ఆజాద్ స్పందించి, నన్ను పట్టుకున్న వారికి ప్రభుత్వం ఇచ్చే ముప్పైవేల
తో పాటు మరో ఇరవై వేలు కూడా ఇస్తానని పోస్టర్ ముద్రించటం తో దేశం అంతా
ఆశ్చర్యపోయింది.
అది 1931 ఫిబ్రవరి 27. ఆజాద్ సుఖ్
దేవ్ తో కలిసి ఉత్తరప్రదేశ్ లోని ఆల్ఫ్రెడ్ పార్కులో ఉన్నట్లు పోలీసులకు
ఒక ఆగంతకుడు సమాచారం అందించాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. చేతిలో
ఉన్నది ఒకే ఒక్క తుపాకి. అందులో ఉన్న బుల్లెట్లు కూడా కొన్నే వాటి సహాయం
తోనే ఆజాద్ చివరివరకు పోలీసులతో భీకరంగా పోరాడాడు. తన స్నేహితుడు సుఖ్ దేవ్
ను అక్కడి నుండి తప్పించాడు. భీకర పోరు లో ముగ్గరు పోలీసులు నేలకొరిగారు.
అప్పటికే ఐదు బుల్లెట్లు అయిపోయాయి. పోలీసులు సమీపిస్తునే ఉన్నారు. ఇక
తప్పించుకునే అవకాశం లేదని ఆజాద్ కు అర్థమైపోయింది. తుపాకి లో ఉన్నది ఒకే
ఒక్క బులెట్. ఆ ఒక్కదానిని ఖర్చుపెట్టి ఒక్క పోలీసును చంపినా తాను వారికి
పట్టుబడటం ఖాయం అని తెలుసుకొన్నాడు. సజీవంగా వారికి పట్టుబడటం కన్నా
స్వేచ్ఛగా మృతుదేవతను కౌగిలించుకోవటం మంచిదని నిర్ణయించుకున్నాడు.
అప్పటివరకు పోలీసులకు గురి పెట్టిన ఆయుధం ఒక్క సారిగా దిశను మార్చుకుని తన
కణత వద్దకు చేరుకుంది. "భారత్ మాతాకీ జై "అనే నినాదం ఒక్కసారిగా అయన గొంతు
లోంచి బయటకు వచ్చి పరిసరాలను ప్రతిధ్వనింపచేసింది.
తుపాకి లోని చివరి గుండు ఆయన కణత లోంచి దూసుకుపోయింది.
![]() |
| ఆజాద్ ప్రాణం విడిచిన ఆల్ఫ్రెడ్ పార్కు |
నిర్బంధాన్ని, శృంఖలాలను జీవితంలో ఏ కోశానా ఒప్పుకొని ఆ అమరవీరుడు
స్వేచ్ఛగానే మృతు ఒడిలోకి జారిపోయాడు. భారత మాత కన్నీటితో అతనిని అక్కున
చేర్చుకుంది. 25 సంవత్సరాల వయసులోనే చంద్ర శేఖర్ ఆజాద్ అమరవీరుడయ్యాడు. ఇది
జరిగిన 25 రోజుల తరువాత 1931 మర్చి 23 న బ్రిటిష్ పోలీసులు భగత్ సింగ్,
రాజగురు, సుఖ్ దేవ్ లను ఉరితీశారు. బానిస శృంఖలాల నుండి భరతజాతిని విముక్తి చేయటం కోసం చివరికి తన
ప్రాణాలనే తృణప్రాయంగా వదులుకున్న అసమాన మహా వీరుడు చంద్ర శేఖర్ ఆజాద్. ఈ
సువిశాలమైన భారత దేశ చరిత్ర ఉన్నంత కాలం ఆ చరిత్రలో ఆజాద్ శిఖరాగ్రాన
అమరుడై వెలుగొందుతూనే ఉంటాడు.
గుర్తుపెట్టుకోండి
దేశం కోసం చంద్ర శేఖర్ ఆజాద్ లాగా, భగత్
సింగ్ లాగా, ఆత్మత్యాగాలు చేసుకునే గొప్ప అవకాశం, అంత అవసరం కూడా నేడు
మనకు లేదు. కానీ భారత జాతి కీర్తిని దశదిశలా వ్యాపించాల్సిన అవసరం మాత్రం మనపైన ఉంది. అంతే కాదు అసామాన్యమైన భారత దేశ అభివృద్ధి లో పాలు పంచుకోవలసిన
బాధ్యత కూడా మనపైన ఉందనేది మర్చిపోరాని విషయం. ప్రపంచ దేశాలకే మార్గదర్శి
అయిన ఈ హిందుస్థాన్ కోసం మనం ఈ మాత్రం కూడా చేయలేమా .... ?
ఆలోచించండి.
ఒక్కసారి ఆలోచించండి.
written by
M.R. Ravindra Nath Tagore
TELUGUINSPIRE.BLOGSPOT.IN
జాతిని, జగతిని జాగృతం చేయటానికి అవనిపై జనయించిన ఎందరో మహానుభావుల గురుంచి మున్ముందు మరింతగా తెలుసుకొందాం.
ఆలోచించండి.
ఒక్కసారి ఆలోచించండి.
written by
M.R. Ravindra Nath Tagore
TELUGUINSPIRE.BLOGSPOT.IN
జాతిని, జగతిని జాగృతం చేయటానికి అవనిపై జనయించిన ఎందరో మహానుభావుల గురుంచి మున్ముందు మరింతగా తెలుసుకొందాం.








Really inspiring brother.... keep it up hope u will continue doing the same. I will never forget the last lines and will strive my level best to contribute something from my side to our great nation.
ReplyDeletethank you bro for giving your great words
DeleteSuper.really inspirational and motivational story..i will try my level best to give something to our nation.go for country,get for country.
ReplyDeleteTO ALL:
it is not great being as an Indian.the thing be as a true Indian is great thing.so do your work as a true Indian.
don't forget last words.
yes. you are right gouthami. The great thing is live as a true Indian , and do something our nation as a responsible indian. thank u for your great replay.
ReplyDeleteSUPER it is very nice brother
ReplyDeleteThank u RGUKT STUDENTS
Deletenice brother,what ever your saying is absolutely correct.we don' need to make any sacrifice for our country.just we have to improve our self and help to neighbours.that is the our contribution towards our society and country.
Delete