పదకొండు సంవత్సరాల పిల్లవాడు జేబు ఖర్చుల అమెరికారోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకున్నాడు. రోజులు గడవటానికి కోకో కోకోలాలు, స్టాంపులు అమ్ముకున్నాడు. కానీ,ఆనాడు అమెరికా ప్రజలకి తెలియదు పాపం, ఈ పిల్లవాడే షేర్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తాడని, లక్షల కోట్లకు అధిపతి అవుతాడని. కాలానికి ఎదురెళ్లి మరి, తన ఆత్మ విశ్వాసంతో ఒక మహా శిఖరంగా ఎదిగాడు. ఎవరు అతను. అతనే ఎడ్వర్డ్ వారెన్ బఫెట్. చిన్న వయసులోనే వ్యాపారంపై మక్కువ పెంచుకొని, వ్యాపార ప్రపంచంలో సాహసమే పెట్టుబడిగా పెట్టి ఎదిగిన బఫెట్ ఈనాటి మన జీవన విజేత.
⇨ బఫెట్ గురించి:
చిన్నప్పుడే బఫెట్ కుటుంబం ఒమహా నుంచి వాషింగ్టన్ డి.సి కు తరలి రావటంతో ప్రాథమిక విద్య అంతా అక్కడే సాగింది. తన తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే బఫెట్ మాత్రం తాత కిరాణా దుకాణంలోని సరుకులు బయట అమ్మిరోజు ఖర్చులు సంపాదించేవాడు.అంతే కాదు ఆ వయసులోనే 25 డాలర్లకు పిన్ బాల్ యంత్రాన్ని కొని, దానిని జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పెట్టి డబ్బులు సంపాదించేవాడు.
⇨ పదకొండు ఏళ్లకే షేర్ల వ్యాపారం:
11 ఏళ్ళ వయసులోనే తన దగ్గరున్న డబ్బులతో తన కోసం మరియు తన
సోదరి కోసం ముప్పై ఎనిమిది డాలర్లకు కొన్ని కంపెనీ షేర్లను కొన్నాడు.
కానీ కొన్న వెంటనే ధర ఇరవై డాలర్లకు పడిపోవటంతో గాబరా పడ్డాడు. కానీ వాటిని
నష్టానికి అమ్మకుండా వాటి విలువ నలభై డాలర్లకు పెరిగాకే అమ్మడు. బఫెట్ ఆ
షేర్లను అమ్మిన తరువాత వాటి విలువ అనూహ్యంగా రెండు వందల డాలర్లకు పెరిగాయి.
ఈ అనుభవమే బఫెట్ కు తొలి పెట్టుబడి పాఠం అయ్యింది.
ఆ తరువాత పంతొమ్మిదేళ్లకే డిగ్రీని పూర్తి చేసి,
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవటానికి అప్లై చేసుకోగా, వయసు తక్కువగా
ఉండనే కారణంతో బఫెట్ ను తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికి మేధావులు
చారిత్రక తప్పిదంగా పరిగణిస్తారు. కాలేజీ చదివే రోజుల్లోనే బఫెట్ రోజుకు
170 డాలర్లు సంపాదించేవాడు బఫెట్, కానీ అతనికి చదువు చెప్పే ప్రొఫసర్లు
కూడా అంత సంపాదించే వారు కాదు.
⇨ జీవితంలో తొలి మలుపు:
ప్రఖ్యాత షేర్ మార్కెట్ నిపుణులు బెన్ గ్రహమ్ మరియు డేవిడ్ డాడ్ లు కొలంబియా విశ్వవిద్యాలం లో ఆచార్యులుగా పనిచేస్తున్నారని తెలుసుకొని అందులోనే చేరాలని నిర్ణయించుకొన్నాడు. అక్కడే ఆయన జీవితం సరికొత్త మలుపు తిరిగింది. వారు బోధించిన పాఠాలు తన విజయ ప్రస్థానానికి నాంది పలికాయి. షేర్ మార్కెట్ గురించి సరికొత్త విషయాలను నేర్చుకొన్నాడు బఫెట్.
⇨ తొలి విజయ అనుభవం :
తన సోదరి డోరిస్ మరియు మరికొంతమందితో కలసి లక్షా ఐదు
వేల డాలర్ల నిధి ని సేకరించి, తాను కూడా వంద డాలర్ల పెట్టుబడిగా పెట్టి
1956లో బఫెట్ అసోసియేషన్ లిమిటెడ్ స్థాపించి, తనకున్న వ్యాపార నిపుణతతో
మూడు సంవత్సరాలు తిరిగేలోగా మూడు లక్షల డాలర్లు సంపాదించుకోగలిగాడు.
అప్పటికే నష్టాలలో కూరుకుపోయిన berk shire hath way అనే వస్త్ర పరిశ్రమను సొంతం చేసుకొని దానిని లాభాల బాట పట్టించాడు బఫెట్.
⇨ విజయాల మోత :
➢ berk shire hath way కు అధిపతి అయిన తరువాత తన విజయాలకు తిరుగు లేకుండా పోయింది.
➢ berk shire hath way కంపెనీ ఒక షేర్ విలువ తాను కొన్నప్పుడు ఏడు డాలర్లు ఉంటే మరి ఇప్పుడు ఏకంగా కోటి అరవై రెండు లక్షల రూపాయలు.
➢ ఆ తరువాత చాకచక్యంగా అనేక కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ, షేర్లు
కొంటూ , తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. coco cola, tha
washington post, IBM, American express, Jetnets, Jillate, Philips వంటి
ఎన్నో పెద్ద కంపెనీలలో అధిక మొత్తములో వాటాలు కలిగి ఉన్నాడు.
➢ తనకున్న అసాధారణ ప్రతిభతో నష్టాలలో ఎన్నో కంపెనీలను లాభాల బాట పట్టించాడు.
⇨ బఫెట్ గురుంచి మరికొన్ని విశేషాలు:
➢ తాను చిన్నపుడు చదివిన The Intelligent Investor,తన జీవితంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని బఫెట్ ఇప్పటికి చెప్తుంటారు.
➢ ఇప్పటికి ఎక్కువగా అమ్ముడవుతున్న పుస్తకాలలో The Intelligent Investor కూడా ఒకటి.
➢ బఫెట్ ఎంత సంపాదించినప్పటికీ భోగభాగ్యాలకు, ఆడంబరాలకు దూరంగా ఉంటారు.
➢దాదాపు అరవై సంవత్సరాల క్రితం తాను కొన్న ప్రహరీ గోడ కూడా లేని ఇల్లు ఇప్పటికి తన నివాసం.
➢ఒక పెద్ద విమానయాన కంపెనీకి అధిపతి అయినా ఇంతవరకు ఏనాడూ సొంత పనులకు వాడింది లేదు.
➢తన ఆలోచనలకు ఒక రూపం ఇచ్చి, బఫెట్ ఫౌండేషన్ ఏర్పరిచి, ఆస్తిలో అధిక భాగం ఆ ఫౌండేషన్ కు చెందేలా వీలునామా రాసాడు.
➢2006 లో తన ఆస్తిలో 99% స్వంచ్ఛంద సంస్థలకు విరాళం చేసాడు.
➢ బిల్ గేట్స్ తో కలసి The Giving Pledge అనే ఆర్గనైజేషన్ ఏర్పరిచి, కుబేరులందరూ ఆస్తిలో సగభాగం విరాళంగా ఇవ్వాలని అందరిని కోరాడు.
➢18 సంవత్సరాలుగా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టి 2008 లో సారిగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకొన్నాడు.
➢ఇప్పటివరకు తాను సంపాదించిన ఆస్తిలో 99%తన వయసు యాభై సంవత్సరాలు దాటిన తరువాత సంపాదించినదే.
➢ 2017 లెక్కల ప్రకారం బఫెట్ ఆస్తి 84.5 బిలియన్ డాలర్లు.
తనకు ఇష్టమున్న రంగాన్నే ఎంచుకొని, ఆ రంగంలో
అత్యున్నత శిఖరంగా ఎదిగి, ఎందరో నిర్భాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపి,
ఎందరికో ఆదర్శమయ్యాడు బఫెట్. జీవితంలో ఓడిపోయిన ప్రతి సారి గెలుపు రుచి
కోసం ప్రయత్నించి, విజయ శిఖరాలను చేరుకొన్నాడు. తాను సంపాదించిన ఆస్తిని
అంతా సమాజానికే ధారాదత్తం చేసిన ఒక గొప్ప నవయుగ దాన శీలి బఫెట్.
గుర్తుపెట్టుకోండి
అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకొనే స్థాయి నుండి
అదే అమెరికాలో లక్షల కోట్ల వ్యాపార సామ్రాజాన్ని సృష్టించేంతవరకు
ఎదగగలిగాడు. ఎలా ఎదగగలిగాడు, తనకున్న ఆసాధారణ ప్రతిభ వల్ల, తనకున్న పట్టుదల
వల్ల, తనకున్న కష్టపడే తత్వం వల్ల ఒక మహా శిఖరంగా ఎదగగలిగాడు.
ఈ సువిశాల ప్రజాస్వామ్య భారత దేశ ఆర్ధిక స్థితిగతులను
మార్చటానికి, మన దేశానికీ కూడా ఇటువంటి బఫెట్ లు అవసరం. ఆ బఫెట్ లు మనలో
లేరా....?
ఆలోచించండి.ఒక్కసారి ఆలోచించండి.
M.R . Ravindra Nath Tagore









NICE STORY
ReplyDelete