ఒకే
ఒక్క యాప్ కుల,
మత,
భాషా,
ప్రాంత,
బేధాలకు
అతీతంగా ప్రపంచంలోని ప్రజలందరినీ
ఏకం చేసి,
సోషల్
మీడియా రంగంలో పెను సునామీ
ను సృష్టించింది.
ఒక్కడు
సృష్టించిన యాప్ ఇంతగా ప్రభావితం
చేయగలదా అని మేధావులందరినీ
ఆశ్చ్యర్యపరిచేలా చేసింది.
అదే
ఫేస్ బుక్.
దాని
రూపకర్త మార్క్ జుకెర్
బర్గ్.
ప్రపంచంలోని
అతి పెద్ద జనాభా కలిగిన చైనా
దేశ జనాభా దాదాపు 137కోట్లు,కానీ
పేస్ బుక్ యూజర్ల సంఖ్య మాత్రం
139
కోట్లు.
ఈ
ఒక్క అంశం చాలు ఫేస్ బుక్
ప్రజలను ఎంతగా ప్రభావితం
చేసిందో.
నాడు
సరదాగా ఒక హాస్టల్ గదిలో ఒక
చిన్న వెబ్ సైట్ గా హార్వర్డ్
యూనివర్సిటీ విద్యార్థుల
కోసం రూపు పోసుకొని నేడు
ప్రపంచంలో అతి పెద్ద సోషల్
నెట్వర్కింగ్ సైట్ గా మారింది
ఫేస్ బుక్.దీని
గాథ ,
మ్యార్క్
జుకెర్ బర్గ్ జీవిత కథ మనందరికీ
స్ఫూర్తి.
➠ జుకర్ బాల్యం:
చిన్న
వయసులోనే జుకెర్ బర్గ్ కు
కంప్యూటర్ అన్నా,
ప్రోగ్రామింగ్
లాంగ్వేజస్ అన్నా,
ఎంతో
ఆసక్తిని చూపేవాడు. దీనిని
గమనించిన జుకెర్ తండ్రి
తనకు తెలిసిన ఒక బేసిక్
ప్రోగ్రాం అయిన అటారీ అనే
ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
ను జుకెర్ కు నేర్పించాడు.
దీనిని
ఎంతో ఇష్టపడ్డ జుకెర్ వీలు
దొరికినప్పుడల్లా తన సమయాన్ని
మొత్తం దీనికే కేటాయించేవాడు.
ఆ
విధంగా చిన్న వయసులోనే
ప్రోగ్రామింగ్ పై పట్టు
సాధించాడు జుకెర్.
ఆ
తరువాత తన తండ్రి జుకెర్ ను
దగ్గరలోఉన్న డేవిడ్ అనే ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్
తో జుకెర్ కు ప్రైవేట్ గా
ప్రోగ్రామింగ్ పై శిక్షణ
ఇప్పించేవాడు కూడా.
కానీ
అతికొద్దీ కాలం ప్రోగ్రామింగ్
లో డేవిడ్ ను మించిపోయాడు
జుకెర్.
తన
సమయం అంతప్రోగ్రామ్ ల మీద
ద్రుష్టి నిలిపేవాడు జుకెర్.
ఆ
సమయం లో తాను జుక్నెట్ అనే
ఒక సాఫ్ట్ వేర్ ను తయారు చేసాడు
జుకెర్.ఇది
ఇప్పటి మెసెంజర్ ను పోలి
ఉంటుంది.
జుక్నెట్
ను జుకెర్,
తన
తండ్రి పని చేసే క్లినిక్
నుండి ఇంటికి అలాగే ఇంటి నుండి
క్లినిక్ కు సమాచారం పంపించడానికి
ఉపయోగించేవారు.
చిత్రమైన
విషయం ఏమిటంటే అప్పటికి
జుకెర్ వయసు కేవలం 12
సంవత్సరాలు
మాత్రమే.
ఎప్పటికప్పుడు
కొత్త కొత్త ప్రోగ్రాం లను
డెవలప్ చేస్తూ తనను కూడా
డెవలప్ చేసుకునేవాడు జుకెర్.
తాను
హై స్కూల్ చదువుతున్నపుడు
SYNAPSE
మీడియా
ప్లేయర్ ను తయారు చేసాడు
జుకెర్.ఆ
తరువాత దానిని AOL, MICROSOFT,వంటి
కంపెనీలు దానిని కొని జుకెర్
బర్గ్ కు జాబ్ ఆఫర్ కూడా చేసాయి.
కానీ
అందుకు జుకెర్ సమ్మతించలేదు
. ఆ
వయసులో అందరు కంప్యూటర్ గేమ్స్
ఆడితే ,
జుకెర్
మాత్రం ఏకంగా కంప్యూటర్ గేమ్స్ ను తయారు చేసేవాడు .
➠ హార్వార్డ్
విశ్వవిద్యాలం:
ఆ
తరువాత జుకెర్ హార్వార్డ్
యూనివర్సిటీ లో సీటు సంపాదించాడు.
తాను
యూనివర్సిటీ లో చదివే సమయం
లో Face mash అనే
ఒక వెబ్ సైట్ ను తయారుచేసాడు.
ఆ
వెబ్ సైట్ లో యూనివర్సిటీ
లోని అందమైన అమ్మాయిల ఫోటోలు
పెట్టి,
ఎవరు
అందంగా ఉన్నారో పోలింగ్
పెట్టేవాడు.
చాలా
తక్కువ సమయం లోనే ఈ వెబ్ సైట్
కు విపరీతమైన స్పందన
వచ్చింది.చివరికి
యూనివర్సిటీలోని సర్వర్లు
కూడా హ్యాంగ్ అయ్యేవి.
అయితే
ఈ వెబ్ సైట్ అమ్మయిల అందానికి
సంబందించినది కావటం తో కొంత
మంది అమ్మాయిలకు ఇది నచ్చకపోవడం
తో వారు జుకెర్ మీద కంప్లైంట్
చేయడం తో జుకెర్ దానిని
ఆపివేయవలసివచ్చింది.
ఈ
సంఘటన తరువాత జుకెర్ ఆలోచనలో
పడ్డాడు.
ఏదైనా
కొత్తగా ఒకటి చేయాలనుకున్నాడు.
అదే
సమయంలో తనకు ఒక కొత్త ఆలోచన
వచ్చింది.
యూనివర్సిటీ
లోని విద్యార్థులందరూ తమ తమ
అభిరుచులు,
ఇష్టాలను,
ఫోటోలను
తమ స్నేహితులతో పంచుకునే
విదంగా ఒక వెబ్ సైట్ ను తయారు
చేయాలను కున్నాడు.ఆలోచన
వచ్చింది తడవు దాని కోసం పని
చేయటం మొదలు పెట్టాడు.
తాను
ఊహించిన ఒక ఊహ కు రూపు ఇవ్వాలని
జుకెర్ ఎంతో కష్టపడ్డాడు.
హాస్టల్
రూమ్ లో ఒంటరిగా ఒక్కడే కూర్చుని
అహర్నిశలు శ్రమించాడు.ఆ విధంగా తాను తయారు చేసిన
వెబ్ సైట్ కు THE
FACE BOOK అని
పేరు పెట్టాడు.తొలి
రోజుల్లో కేవలం హార్వార్డ్
విశ్వవిద్యాలయానికే పరిమితం
అయినా,
ఆ
తరువాత వెబ్ సైట్ ను అమెరికాలోని
ఇతర యూనివర్సిటిలకు కూడ
అందుబాటులోకి తెచ్చేలా చేసాడు
జుకెర్.
➠ పేస్ బుక్ కు రూపం::
ఈ
సమయం లో వెబ్ సైట్ ను మరింత
గా డెవలప్ చేయాలనే ఉద్దేశం
తో హార్వార్డ్ విశ్వవిద్యాలయం
లో చదువు మానేసి,
పూర్తిగా
తాను అనుకున్న పని పైనే దృష్టి
పెట్టాడు జుకెర్.
ఆ
తరువాత the
face bookనుండి
the ను
తొలగించి face
book కు2004
వ
సంవత్సరం లో feb
4 వ
తేదిన ఒక పూర్తి రూపం ఇచ్చాడు
జుకర్.
face book కు
వస్తున్న స్పందన చూసి దానిని
విద్యార్థులకే కాకుండా మొత్తము
అందరికి అందుబాటులోకి
తీసుకురావటం జరిగింది.
దీని
వల్ల 2004
చివరినాటికి
ఏకంగా 10
లక్షల
యూజర్లను సంపాయించుకోగల్గింది
పేస్ బుక్ .
➠ ఫేస్ బుక్ గురించి , జుకెర్ బర్గ్ గురించి మరికొన్ని విశేషాలు:
➠ ఫేస్ బుక్ గురించి , జుకెర్ బర్గ్ గురించి మరికొన్ని విశేషాలు:
⏩ ఫేస్
బుక్ యొక్క దిన దినాభివృద్ధిని
చూసిన microsoft,యాహు
వంటి ఎన్నో కంపెనీలు
సైతం ఫేస్ బుక్ ను కొనటానికి ఎంతో పోటీ పడ్డాయి.ఏకంగా
యాహు అయితే దాదాపు 960
మిలియన్
డాలర్లు ఇవ్వటానికి సాహసించింది.
⏩ ముందు
చూపు ఎక్కువగా ఉన్న జుకెర్
అప్పటికే తొలి దశలో ఉన్న
instaragram
ను
ఒక బిలియన్ డాలర్లు చెల్లించి
తన సొంతం చేసుకొన్నాడు.
⏩ ఇంతే
కాకుండా అప్పుడప్పుడే వెలుగులోకి
వస్తున్న చిన్న చిన్న సంస్థలైన
friend
feeds, chai labs,connect u వంటి
ఎన్ని సంస్థలను పేస్ బుక్ లో
కలిపేసుకొన్నాడు జుకెర్.
⏩ 2012 లో చైనాకు చెందిన ప్రిసిల్లా చాన్ అనే తన స్నేహితురాలను వివాహం చేసుకొన్నాడు.
![]() | |
| Jukar with his wife |
⏩ 2012 లో పేస్ బుక్ స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది.
⏩ 2010 మరియు 2013 లో జుకెర్ ను టైమ్స్ మ్యాగజిన్ పర్సన్ అఫ్ ది ఇయర్ గా ప్రకటించింది.
⏩ సహజంగానే దాన స్వభావం కల జుకెర్ 2013 లో ఎబోలా వ్యాధి బారిన పడ్డ వారి సహాయార్థం దాదాపు గా వంద కోట్లకు పైనే సహాయం చేసాడు జుకెర్.
⏩ 2014 లో whatsapp ను సుమారు 19 బిలియన్ డాలర్లు అంటే అక్షరాల లక్షా 20 వేల కోట్లు పెట్టి దానిని తన సొంతం చేసుకొన్నాడు.
⏩ ఈ విధంగా సోషల్ మీడియా రంగం లో తనకు ఎదురు లేకపోవటం తో, పేస్ బుక్ ను ప్రారంభించి పది సంవత్సరాలు తిరిగేలోపల లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.
⏩ పేస్ బుక్ సీఈఓ గా సంవత్సరానికి జుకెర్ తీసుకొనే జీతం కేవలం 1 డాలర్.
⏩ ఆసక్తికరమైన
విషయం ఏమిటంటే జుకెర్ బర్గ్
జీవితం పై the
social network అనే
హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది
, అంతే
కాదు ఆ సినిమా ఏకంగా మూడు
ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది.
⏩ జుకర్ బర్గ్ నాస్తికుడు.
⏩ ప్రపంచంలోని దాదాపు 15 కోట్ల మందికి ఉచితంగా ఇంటర్నెట్ ను అందిచ్చాలనే ఆశయంతో ఉన్న జుకర్ internet.org అనే సంస్థను కూడా నెలకొల్పాడు.
⏩ దాదాపు
పేస్ బుక్ ఎక్కువగా నీలం
రంగులోనే ఉంటుంది.
ఎందుకంటే
జుకెర్ colour
blindness తో
బాధపడుతున్నాడు.
అందువల్ల
అతను ఎరుపు రంగును,
ఆకుపచ్చ
రంగును సరిగా చూడలేడు.
⏩ వారెన్
బఫెట్ మరియు బిల్ గేట్స్ కలిసి
స్థాపించిన The
giving pledge అనే
ఆర్గనైజషన్ కు తన ఆస్తిలో
సగభాగం విరాళం చేసాడు
జుకర్.
⏩ 2015 లో
డిసెంబర్ లో తనకు కూతురు
పుట్టిన సందర్బంగా,ఫేస్ బుక్ కంపెనీలో తనకున్న వాటాలో
99% జాన్
జుకర్ బర్గ్ ఫౌండేషన్ కు
రాసిచ్చాడు జుకెర్ బర్గ్.
తన
తోటి స్నేహతులు పార్టీలు
చేసుకొంటుంటే తాను మాత్రం
హాస్టల్ గదిలో ఒక్కడే పేస్
బుక్ కోసం నిరంతరం శ్రమించాడు
అయినా అందుకు ఏనాడూ బాధపడలేదు,
ఫేస్
బుక్ ను అభివృద్ధి చేయటం కోసం
హార్వార్డ్ విశ్వవిద్యాలయం
లో చదువు వదులుకోవడానికి ఏ
మాత్రం ఆలోచించలేదు ,తాను
కన్న కలలకు ఒక రూపం ఇచ్చి,తన
ఆసాధారణ ప్రతిభ తో ఈరోజు
ప్రపంచ ప్రజలందరినీ ఒక తాటి
పైకి తీసుకురాగలిగాడు.
33సంవత్సరాలకే
లక్షలకోట్లకు అధిపతి అయినా
జుకర్ ఏనాడూ గర్వాన్ని
ప్రదర్శించలేదు.
ఇంట్లో
ఆడపిల్ల పుడితే మరింతగా
ఆస్తులు కూడబెట్టుకొనే
ఈరోజుల్లో,
ఆడపిల్ల
పుట్టిందన్న సంతోషంతో ఉన్న
ఆస్తులన్నీ నలుగురి బాగు
కోసం దానం చేసిన మహనీయుడు
జుకర్.
తాను
ఎదగటమే కాకుండా,
ఎందరో
నిర్భాగ్యుల,
నిరాశ్రయుల
జీవితాల్లో వెలుగు నింపాడు
జుకర్.అందుకే
ఈ దశాబ్దపు కాదు కాదు ఈ శతాబ్దపు
విజేతలలో ఒకడిగా నిలిచాడు
జుకర్.
ఎన్నో
కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు
ఈ జీవన విజేత.
ప్రపంచంలో
ఏ దేశానికీ లేని యువ శక్తి
కేవలం ఈ అఖండ భారతదేశనికి
మాత్రమే సొంతం. అటువంటి
యువత నేడు అవకాశాలు లేక నిరాశ,
నిస్పృహలతో,నైపుణ్యాల
కొరతతో మగ్గుతుంటే ,
మార్క్
జుకర్ బర్గ్ జీవితచరిత్ర
మాత్రం నువ్వే ఒక నాయకుడివై
సరికొత్త లోకానికి దారి
చూపించమని ,అఖండ
శిఖరాలను చేరుకోమని మనందరికీ
చెప్తోంది.అది
సాధించటానికి,
మిమ్మల్ని
మీరు నిరూపించుకోవటానికి
సిద్ధమా ?
ఆలోచించండి.
ఒక్క సారి ఆలోచించండి.
by,
M.R.Ravindra
Nath Tagore
TELUGUINSPIRE.BLOGSPOT.IN 










Nice Keepit up.
ReplyDeletenice brother
ReplyDelete