![]() |
పేదరికం
అతనికి చాలా దగ్గరి బంధువు.
ఎప్పుడూ
తన వెంటే ఉంటుంది.
సరస్వతి
దేవి అతనికి దూరపు బంధువు,
అందుకే
పదవతరగతికి మించి చదువు
సాగలేదు.తనకంటూ
చెప్పుకోవటానికి ప్రత్యేకంగా
ఏమిలేదు.
అయినా
మనసులో ఏదో సాధించాలనే సంకల్పం,
గెలుపుకోసం
ఎంతకైనా తెగించే పోరాట తత్వం,
నిప్పులాంటి
తన ఆశయం,
ఒక
వ్యక్తిని విజేతను చేశాయి.
నేడు
ఆ వ్యక్తి మనందరికి ఆదర్శం.
అతడే
ధీరుభాయి అంబానీ.అతని
జీవిత చరిత్రే ఈనాటి మన జీవన
విజేత గాథ.
తనను
కన్న తల్లిదండ్రులు పడుతున్న
కష్టాలను చూడలేక పదహారు
సంవత్సరాల వయసులోనే దేశం
కాని దేశంలో కష్టాల కడలిని
దాటడానికి పెట్రోల్ బంక్ లో
పనిచేయవలసి వచ్చింది.అయినా
అందుకు ఏనాడూ బాధపడలేదు.
ఇదే
తనకు దేవుడిచ్చిన అవకాశంగా
భావించాడు.వ్యాపారం
పై మక్కువ పెంచుకున్నాడు.
అంచెలంచెలుగా
ఎదుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద
కంపెనీలలో ఒకటైన రిలయన్స్
ను స్థాపించాడు.
ఇప్పుడు
రిలయన్స్ అంటే ఒక కంపెనీ కాదు,
ఒక
బ్రాండ్.2,50,000
మంది
ఉద్యోగులతో దేశంలోనే రెండవ
అతి పెద్ద కంపెనీగా రిలయన్స్
విరాజిల్లుతోంది.
1932
డిసెంబర్
28
న
గుజరాత్ లో ఓ సామాన్యమైన
కుటుంబంలో జన్మించాడు ధీరూ
భాయ్ అంబానీ.
తండ్రి
పాఠశాల ఉపాద్యాయుడు కావటంతో
సహజంగానే చిన్నప్పటి నుంచే
ప్రతి విషయం లో ఎంతో నిజాయితీగా
ఉండేవాడు ధీరూ.
తన
తండ్రి కి వచ్చే జీతంతో ఇల్లు
గడవటం కష్టమని గ్రహించి,
చదువు
మానేసి ,ఉద్యోగ
వేటలో పడ్డాడు ధీరూ.
భారత
దేశాన్ని విడిచి యెమన్ దేశంలో
ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసాడు.
అక్కడే
పలు రకాల ఉద్యోగాలు చేసి
వ్యాపారం పై ఒక అవగాహనను
ఏర్పరుచుకొన్నాడు.
ఒక
కంపెనీని ఏ విధంగా ప్రారంభించాలి,
అకౌంటింగ్స్
ఎలా చూడాలి,వంటి
ఎన్నో విషయాలను తెలుసుకొన్నాడు.
➾ రిలయన్స్ కు శ్రీకారం:
1962
లో
పుట్టిన గడ్డ మీద మమకారంతో,
సంపాదించిన
పదిహేనువేల రూపాయలతో సొంత
దేశానికీ తిరిగొచ్చాడు ధీరూ
అంబానీ.వ్యాపారం
చేయాలని మనసులో ఆతృత.
కానీ
చేతిలో ఉన్న డబ్బు సరిపోదు.
అయితేనేం
మరికొంత డబ్బును అప్పుగా
తీసుకొని రిలయన్స్ కమర్షియల్
కార్పొరేషన్ ను ఒక చిన్న గదిలో
ప్రారంభించాడు.
విదేశాల
నుండి పాలిస్టర్ ను దిగుమతి
చేసుకొని మసాల దినుసులను
ఎగుమతి చేసేవాడు.
తన
ఆసాధారణ ప్రతిభ వల్ల చేసిన
ఆ వ్యాపారంలో విజయం సాధించాడు.
1977 లో
గుజరాత్ లోని అహ్మదాబాద్
దగ్గర టెక్సటైల్ మిల్లును
స్థాపించాడు.
తాను
ఉత్పత్తి చేసిన బట్టలను విమల్
బ్రాండ్ పేరు తో మార్కెట్
లోకి తెచ్చి విజవంతం అయ్యాడు.
ఆ
తరువాత రిలయన్స్ కు తిరుగు
లేకుండా పోయింది.ఒకానొక
దశలో రూపాయి విలువ పడిపోయినా
ఆ పరిస్థితులను తట్టుకొని
రిలయన్స్ నిలబడింది.
ఆ
తరువాత దేశంలోనే అత్యుత్తమ
వ్యాపార సామ్రాజ్యంగా రిలయన్స్
ను ఎదిగేలా చేసాడు ధీరు అంబానీ.
1984 లో
రిలయన్స్ కంపెనీలోకి లోకి
తన ఇద్దరు కుమారుల రాకతో సమూల
ప్రక్షాళన జరిగింది.
వారు
అనుసరించిన విధానాలతో,
అప్పటికే
గెలుపు దారిలో దూసుకుపోతున్న
రిలయన్స్,
దేశంలోనే
అత్యుత్తమ వ్యాపార సామ్రాజ్యంగా
ఎదిగింది.
ఆ
తరువాత ధీరు భాయ్ అంబానీ
వివిధ వ్యాపార రంగాలలో అడుగిడుతూ
వేల కోట్ల రూపాయల ఆదాయంతో
పాటు,
తన
రిలయన్స్ ఉనికిని నలుమూలలా
విస్తరించేలా చేసాడు ధీరూ
భాయ్.పెట్రో
కెమికల్స్,
టెలీ
కమ్యూనికేషన్,
ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ,
టెక్సటైల్స్,
రిటైల్
వంటి ప్రతి రంగంలో రిలయన్స్
ముద్ర వేసాడు ధీరూ.
1962 లో
భారత దేశానికీ పదిహేనువేల
రూపాయలతో తిరిగివచ్చిన
ధీరూ 2002
నాటికీ
డెబ్భైదు వేల కోట్లకు అధిపతి
కాగలిగాడు.2002
లో
ధీరు భాయ్ అంబానీ భౌతికంగా
ఈ ప్రపంచాన్ని వీడినప్పటి,
ఆయన
జీవించిన జీవితం,
జీవితంలో
వేసిన ప్రతి అడుగు నేడు
స్వయంకృషితో ఎదగాలనుకునే
ప్రతి ఒక్కరికి స్ఫూర్తి
దాయకం.
ధీరుభాయి అంబానీ మరణం తరువాత ముకేష్ అంబానీ మరియు అనిల్ అంబానీ మధ్య విబేధాల కారణంగా రిలయన్స్ రెండు గా చీలింది.ప్రస్తుతం ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు ,అనిల్ అంబానీ తన అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ముకేష్ అంబానీ దాదాపు 2.50 లక్షల కోట్లతో ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.
గుర్తుపెట్టుకోండి.
నాడు
నెల జీతం కోసం దేశం కానీ దేశంలో
పెట్రోల్ బంక్ లో పని చేసాడు.
తన
పట్టుదల తనను రిలయన్స్
పెట్రోలియం లిమిటెడ్ కు
అధిపతిని చేస్తే,
తన
ఆసాధారణ ప్రతిభ దేశ ప్రజలకు
ఆదర్శప్రాయుణ్ణి చేసింది.
చదివింది
కేవలం పదవతరగతి అయితేనేం
కొన్ని లక్షల మంది ఇంజినీర్లకు
ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగాడు.
జీవితంలో
ఏదో సాధించాలని ప్రతి ఒక్కరు
కలలు కంటారు.
అయితే
కొద్ది మాత్రమే ఆ కలలను నిజం
చేసుకోవటానికి రాత్రి పగలు
కష్టపడి గెలుపుశిఖరాలను
చేరుకొని విజయానందాన్ని
అనుభవిస్తారు,
అంతేకాదు
కొన్ని కోట్ల మందిని ప్రభావితం
చేయగలవారవుతారు.
అయితే
మన వల్ల కొన్ని కోట్ల మంది
ప్రభావితం కావాలంటే మనమెంత
సమర్థవంతంగా ఉండాలో,
మన
ఆలోచనలు ఎంత గొప్పగా ఉండాలో,
ఆలోచించండి,ఒక్కసారి ఆలోచించండి.
by
M.R. Ravindra Nath Tagore





Nice story anna , thank you ,
ReplyDeletethanks anna you are doing good job
ReplyDelete